కరోనా కొత్త లక్షణం: ఇలా కనిపిస్తే అనుమానించాల్సిందే...!!

By Siva KodatiFirst Published Apr 24, 2020, 3:58 PM IST
Highlights

ఏ వ్యాధినైనా గుర్తించాలంటే లక్షణాలు అత్యవసరం. దీని వల్ల తమకు ఆ వ్యాధి సోకిందో లేదో సామాన్యులు సైతం తెలుసుకోగలుగుతారు. కోవిడ్‌కు సంబంధించినంత వరకు పొడిదగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలను చెబుతున్నారు. 

మానవాళి మనుగడకే సవాల్ విసురుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలన్నీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రతినిత్యం వేలాది మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతుండటంతో వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది.

ఏ వ్యాధినైనా గుర్తించాలంటే లక్షణాలు అత్యవసరం. దీని వల్ల తమకు ఆ వ్యాధి సోకిందో లేదో సామాన్యులు సైతం తెలుసుకోగలుగుతారు. కోవిడ్‌కు సంబంధించినంత వరకు పొడిదగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలను చెబుతున్నారు.

Also Read:భారతీయులకు కరోనాను ఎదుర్కొనే ధైర్యం ఉంది: చైనా వైద్య నిపుణుడు జాంగ్ వెన్ హాంగ్

అయితే కొంతమందిలో ఈ లక్షణాలు బయటపడనప్పటికీ పాజిటివ్‌గా తేలడంతో ఆందోళన కలుగుతుంది. నిన్న మొన్నటి వరకు వృద్ధులపైనే ప్రతాపం చూపిన వైరస్ ఇప్పుడు చిన్నారులపైనా పంజా విసురుతోంది.

ఈ క్రమంలో యూరప్, అమెరికాలకు చెందిన డెర్మటాలజిస్టులు టీనేజర్లలో కరోనా లక్షణాలు గుర్తించేందుకు గాను వారి కాలి బోటన వేళ్లను పరీక్షించాలని చెబుతున్నారు. కోవిడ్ 19 వ్యాపించిన తొలినాళ్లలో చాలా మంది చిన్నారుల పాదాలు, బొటనవేళ్లకు వాపులు రావడం, రంగు మారడం వంటి లక్షణాలను గుర్తించామని ఇటలీ వైద్యులు తెలిపారు.

ఈ లక్షణాలు కనిపించిన చిన్నారుల్లో కొంతమందికి కోవిడ్ 19 సోకినట్లు నిర్థారించామని, అందువల్ల పసిపిల్లల్లో కరోనా లక్షణాలు  గుర్తించేందుకు కోవిడ్ టోస్ టెస్టు సహాయపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

Also Read:క్లినికల్ ట్రయల్స్ లో కరోనా డ్రగ్ రెమ్‌డెసివి‌ర్ ఫెయిల్!

అమెరికన్ డెర్మటాలజీ డాక్టర్ల అసోసియేషన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కోవిడ్ టోస్ ఉన్న పిల్లలకు ముందు జాగ్రత్త చర్యగా కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందిగా సూచించింది.

మరోవైపు కరోనా పేషెంట్ల ఒక్కో శరీర భాగంలో రక్తం గడ్డకడుతోందంటూ న్యూయార్క్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రోగుల్లో మూత్ర పిండ నాళాలు, ఊపిరితిత్తుల్లోని భాగాలు, మెదడులో రక్తం చిక్కబడటం గుర్తించామని వారు పేర్కొన్నారు. 

click me!