భారతీయులకు కరోనాను ఎదుర్కొనే ధైర్యం ఉంది: చైనా వైద్య నిపుణుడు జాంగ్ వెన్ హాంగ్

By narsimha lodeFirst Published Apr 24, 2020, 3:32 PM IST
Highlights

కరోనాను భారతీయులు మానసికంగా  ధీటుగా ఎదుర్కొంటారని చైనాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు జాంగ్ వెన్ హాంగ్ అభిప్రాయపడ్డారు. కరోనాను ఎదుర్కొనే మానసిక సామర్థ్యం భారత్ లో మెండుగా ఉందన్నారు.
 


బీజింగ్:కరోనాను భారతీయులు మానసికంగా  ధీటుగా ఎదుర్కొంటారని చైనాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు జాంగ్ వెన్ హాంగ్ అభిప్రాయపడ్డారు. కరోనాను ఎదుర్కొనే మానసిక సామర్థ్యం భారత్ లో మెండుగా ఉందన్నారు.

భారత్ లో ఉన్న చైనా విద్యార్థులను ఉద్దేశించి ఆయన వీడియో కాన్పరెన్స్ లో మాట్లాడారు.  షాంఘైలోని హుషాన్ ఆసుపత్రి అంటువ్యాధుల విభాగం డైరెక్టర్ గా వెన్ హాంగ్ పనిచేస్తున్నారు. 

also read:ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్, చైనాలో ముద్దుల పోటీ: ఏకేసిన నెటిజన్లు

భారత్ లో వైరస్ వ్యాప్తి వేగంగా చోటు చేసుకొంటున్నా అమెరికాలో రోగుల సంఖ్యతో పోలిస్తే అధిక జనాభా ఉన్న భారత్ లో అది పరిమితంగానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ లో ఈ వైరస్ సోకే వారి సంఖ్య 10 శాతానికి మించి ఉండదన్నారు. 

90 శాతం భారతీయులకు వైరస్ వ్యాప్తి చెందదన్నారు. మీ చుట్టూ ఉన్న వారిలో 90 శాతం మందికి వైరస్ సోకదని ఆయన చైనా విద్యార్థులకు భరోసా ఇచ్చారు.చైనా ప్రభుత్వ వ్యూహాల వెనుక ప్రధాన సూత్రధారిగా జాంగ్ వ్యవహరిస్తారని చెబుతారు. శుక్రవారం నాటికి దేశంలో 23,077 కేసులు  నమోదయ్యాయి. సుమారు 718 మంది మృతి చెందారు. 4719 మంది ఈ వైరస్ నుండి కోలుకొన్నారు.
 

click me!