కరోనా చికిత్సలో భాగంగా నిర్వహించిన మొదటిదశ క్లినికల్ ట్రయల్స్‌లో రెమ్‌డెసివిర్ డ్రగ్ ఫెయిలయ్యింది. ఈ మందు వల్ల దుష్ప్రభావాలు అధికంగా ఉన్నట్లు నిపుణులు నిర్ధారించారు.
కరోనా వైరస్ పై సలుపుతున్న పోరులో ప్రపంచం వద్ద ఆ మహమ్మారిని ఎదుర్కునే మందు లేదు. ఇంతవరకు మందు లేకపోవడం, వాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం మరో 10 నెలల సమయం ఖచ్చితంగా పట్టేవిధంగా కనబడుతుంది.
ఇలా మందులు లేకపోవడంతో ప్రపంచమంతా హైడ్రోక్సీక్లోరోక్విన్ నుండి మొదలు హెచ్ఐవి కి వాడే మందుల వరకు రకరకాల మందులను అన్ని దేశాలు రోగులకు ఇస్తున్నాయి. ఇలా అందుబాటులో ఉన్న మందులను అందిస్తూనే నూతన మందులను కూడా అభివృద్ధి పరుస్తున్నాయి అన్ని దేశాలు.
తాజాగా కరోనా చికిత్సలో భాగంగా నిర్వహించిన మొదటిదశ క్లినికల్ ట్రయల్స్‌లో రెమ్‌డెసివిర్ డ్రగ్ ఫెయిలయ్యింది. ఈ మందు వల్ల దుష్ప్రభావాలు అధికంగా ఉన్నట్లు నిపుణులు నిర్ధారించారు.
గిలియడ్ సైన్సెన్స్ తయారు చేసిన ఈ డ్రగ్ కరోనాపై పని చేయడంలో విఫలమైనది. దీనికి సంబంధించిన నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించారు. కొద్ది సేపు మాత్రమే ఈ డ్రగ్ కి సంబంధించిన నివేదిక ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్ సైట్ పై దర్శనమిచ్చింది. ఆతరువాత ఈ రిపోర్టును తొలిగించారు.
సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా మొదటిదశలోనే డ్రగ్ వాడకాన్ని నిషేదించినట్లు చైనా వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ డ్రగ్ ఉపయోగించినవారిలో మరణాల రేటు కూడా నమోదైనట్లు పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.
అయితే గిలియడ్ సైన్సెన్స్ కంపెనీ ప్రతినిధులు మాత్రం ఈ నివేదికలో తమ డ్రగ్ కి సానుకూలమైన అంశాలు కూడా చాలా ఉన్నట్టు, తాము ఈ డ్రగ్ ని మరింత అవ్భివృద్ధి పరుస్తామని, ఈ డ్రగ్ కి కరోనా ను అంతం చేసే శక్తి ఉందని వారు అంటున్నారు.
ఇక క్లినికల్ ట్రయల్స్ ను సాధ్యమైనంత ఎక్కువగా జరిపినప్పుడు మాత్రమే ఒక ఔషధం ప్రభావం తెలుస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు ఈ రెమ్‌డెసివిర్ డ్రగ్ ని కూడా వైరస్ సోకగానే ఇచ్చి పరీక్ష చేయాలనీ, అప్పుడు మాత్రమే దీని కరెక్ట్ పనితనాన్ని అంచనా వేసే వీలుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతానికి కరోనా పాలిటి వండర్ డ్రగ్ గా మారిన హైడ్రాక్సీక్లోరోక్విన్ కూడా అందరి మీద ఒకేలా ప్రభావం చూపడం లేదని, ఒక్కొక్కరిపై వారి జన్యువుల ఆధారంగా డిఎన్ఏ ఆధారంగా ఫలితాలను చూపెడుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.