కలకలం: కరోనా కొత్త వేరియంట్‌ గుర్తింపు, సీ.1. 2 గా పేరు

By narsimha lodeFirst Published Aug 30, 2021, 9:27 PM IST
Highlights


కరోనా వైరస్ మరో కొత్త వేరియంట్ ను వైద్య నిపుణులు గుర్తించారు. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా దీన్ని గుర్తించారు. దీన్ని  సీ.1. 2 గా పిలుస్తున్నారు. దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాలకు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందిందని నిపుణులు తెలిపారు.

న్యూఢిల్లీ: కరోనా డెల్టా వంటి కొత్త వేరియంట్లతో  ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే కరోనా మరో రకం వైరస్  ను వైద్య నిపుణులు గుర్తించారు.ఈ కొత్త రకం వేరియంట్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని గుర్తించారు. కొత్త రకం వేరియంట్ ను సీ.1. 2 గా పిలుస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఈ కొత్త రకం వేరియంట్ వెలుగు చూసింది.ఈ ఏడాద మే మాసంలో తొలిసారిగా ఈ వేరియంట్ ను  గుర్తించినట్టుగా దక్షిణాఫ్రికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనినికేబుల్ డిసీజెస్ , క్వాజులు నాటల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ సీక్వెన్సింగ్ ఫ్లాట్‌ఫాం సంయుక్తంగా ప్రకటించింది.

ఆగష్టు  13 నాటికి చైనా, కాంగో, మారిషస్, ఐర్లాండ్, న్యూజిలాండ్ , పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లో కూడ ఈ వేరియంట్  విస్తరించింది. కరోనా బీటా, డెల్టా వేరియంట్ల మాదిరిగానే కొత్త వైరస్ వ్యాప్తి చెందుతుందని గుర్తించారు.సీ.1. 2 గా పిలిచే కొత్త వేరియంట్  కూడా యాంటీబాడీలను కూడ తట్టుకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 

click me!