Taliban: తాలిబాన్లను గుర్తించకుంటే పశ్చిమ దేశాలకు మరో 9/11 దాడి ముప్పు: పాకిస్తాన్ నేత వ్యాఖ్యలు

By telugu teamFirst Published Aug 30, 2021, 5:47 PM IST
Highlights

పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పశ్చిమ దేశాలు వెంటనే ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్లను గుర్తించాలని, లేదంటే మరో 9/11 దాడికి కాచుక్కూచోవాలని హెచ్చరించారు. అనంతరం తన వ్యాఖ్యలను వక్రీకరించారని యూసుఫ్ కార్యాలయం పేర్కొంది. కాగా, బ్రిటన్ మీడియా సంస్థ ఈ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. యూసుఫ్ ఇంటర్వ్యూను తాము రికార్డ్ చేశామని, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించలేదని స్పష్టం చేసింది.
 

న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల క్రితం అమెరికా సహా ప్రపంచమే నివ్వెరపోయే ఘటన చోటుచేసుకుంది. 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్ సిటీలోని లోయర్ మాన్‌హాటన్‌లో గట్టి బధ్రత నడుమ ఉండే పెద్ద కాంప్లెక్స్‌పై ఉగ్రవాదులు రెండు విమానాలను హైజాక్ చేసి దాడికి పాల్పడ్డారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లు నేలమట్టమయ్యాయి. ఒసామా బిన్ లాడెన్ సారథ్యంలోని అల్ ఖైదా ఈ దాడులకు పాల్పడిన సంగత తెలిసిందే. ఈ దాడి కారణంగానే అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్‌లోకి ఎంటర్ కావలసి వచ్చింది. అగ్రరాజ్య అమెరికా నడిబొడ్డున కట్టుదిట్టమైన భద్రతావలయంలో ఉండే ట్రేడ్ సెంటర్లను అగ్రరాజ్య అమెరికా నడిబొడ్డున కట్టుదిట్టమైన భద్రతావలయంలో ఉండే ట్రేడ్ సెంటర్లను నేలకూల్చడంపై యావత్ ప్రపంచం షాక్‌కు గురైంది. రెండు దశాబ్దాలు గడవడానికి వస్తున్నా సగటు అమెరికా పౌరుడి మదిలో ఇప్పటికీ ఆ గాయం పచ్చిగానే ఉంటుంది. అలాంటి దాడే పశ్చిమ దేశాలో మరోసారి ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్తాన్ భద్రతా సలహాదారు హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లను వెంటనే గుర్తించాలని లేదంటే మరో 9/11 ముప్పు ఉంటుందని హెచ్చరించారు. తర్వాత ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.

పాశ్చాత్య దేశాలు వెంటనే తాలిబాన్లను  గుర్తించాలని లేదంటే మరో 9/11 దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వూజర్ మొయీద్ యూసుఫ్ బ్రిటన్ పత్రిక ది సండే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాలిబాన్లను వెంటనే గుర్తించి వారితో కలిసి పనిచేయాలని, లేదంటే 9/11 ముప్పు కోసం సిద్ధంగా ఉండాలని తెలిపారు. అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో రాజకీయ శూన్యత ఏర్పడిందని, వెంటనే తాలిబాన్లను గుర్తించాలని లేదంటే విద్రోహశక్తుల ఆధిపత్యం పెరుగుతుందని హెచ్చరించారు. గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే పాశ్చాత్య దేశాలపై దాడులు జరిగాయని తెలిపారు. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడే అవకాశముందని, కాబట్టి, గతంలో చేసిన తప్పిదాన్ని మళ్లీ పునరావృతం చేయకుండా తాలిబాన్లను వెంటనే గుర్తించాలని సూచించారు.

అనంతరం తన వ్యాఖ్యలను వక్రీకరించినట్టు యూసుఫ్ కార్యాలయం పేర్కొంది. బ్రిటన్‌లోని పాకిస్తాన్ ఎంబసీ ఆ వ్యాఖ్యలను సరిచేయాల్సిందిగా పత్రికకు నోటీసులు పంపింది. కాగా, ది సండే టైమ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ కరస్పాండెంట్, అవార్డ్ విన్నింగ్ జర్నలిస్టు క్రిస్టినా ల్యాంబ్ యూసుఫ్ కార్యాలయం ఆరోపణను తిప్పికొట్టారు. యూసుఫ్ ఇంటర్వ్యూను తాము రికార్డ్ చేశామని, తాము ఆయన వ్యాఖ్యలను వక్రీకరించలేదని స్పష్టం చేశారు.

click me!