జెన్ జెడ్ నిరసనలు: కాల్పులు, కర్ఫ్యూలతో నేపాల్ అల్లకల్లోలం.. వీడియోలు వైరల్

Published : Sep 08, 2025, 05:09 PM IST
Nepal Gen Z protest

సారాంశం

Nepal Gen Z Protest: నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధంపై జెన్ జెడ్ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే రాజధానితో పాటు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనకారులపై కాల్పులు జరపడంతో డజనుకు పైగా ప్రాణాలు కోల్పోయారు.

Nepal Gen Z Protest: సోషల్ మీడియా నిషేధంపై నేపాల్‌లో జెన్ జెడ్ నిరసనలు హెరెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ సోమవారం వేలాది మంది తీవ్ర నిరసనలు తెలిపారు. నిరసనకారులు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించి నిప్పంటించారు. వారిని ఆపడానికి పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. నిరసనకారులు రాళ్లు రువ్వారు. హింసాత్మక ఘర్షణల్లో డజనుకు పైగా మరణించినట్లు సమాచారం. దాదాపు 100 మంది గాయపడ్డారు. ఖాట్మండులో కర్ఫ్యూ విధించారు. నేపాల్ హింసకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిలోని ఐదు వీడియోలు ఇప్పుడు చూద్దాం. 

వీడియో 1- పోలీసుల కాల్పులు

ANI షేర్ చేసిన వీడియోలో పోలీసులు కాల్పులు జరుపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటన పార్లమెంటు వద్ద జరిగింది.

 

 

వీడియో 2- పార్లమెంటుపై దాడి, నిప్పు

నిరసనకారులు పార్లమెంటు గేటును ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. కొందరు పైకప్పుపై నుంచి దూకారు. పార్లమెంటు నుంచి నల్లని పొగలు వచ్చాయి.

 

 

వీడియో 3- నినాదాలు, గందరగోళం

కొందరు పార్లమెంటు గోడ ఎక్కి నినాదాలు చేశారు. వేల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. టియర్ గ్యాస్ పొగలు అలుముకున్నాయి.

 

 

వీడియో 4- బారికేడ్లను దాటుతున్న నిరసనకారులు

వేల సంఖ్యలో నిరసనకారులు బారికేడ్లను దాటారు. పోలీసులతో ఘర్షణ జరిగింది.

 

 

వీడియో 5- యుద్ధభూమిలా ఖాట్మండు

ఖాట్మండు వీధులు యుద్ధభూమిని తలపించాయి. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రాళ్ళ దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !