నేపాల్ లో ప్రకృతి విలయతాండవం... 38మంది మృతి, 50మందికి గాయాలు

By Arun Kumar PFirst Published Jul 4, 2021, 11:13 AM IST
Highlights

గడిచిన 20 రోజులుగా నేపాల్ లో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. 

కాఠ్మండు: నేపాల్ లో కురుస్తున్న భారీ వర్షాలు మరణ మృదంగం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా నదులన్నీ పొంగిపొర్లుతూ ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. అంతేకాకుండా వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నారు. ఇలా వరదలు, కొండచరియలు విరిగిపడటంలో దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

గడిచిన 20 రోజులుగా నేపాల్ లో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులన్నీ వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నారు. దీంతో తీర ప్రాంతాలను నదీ జలాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలువురు మృత్యువాతపడగా చాలామంది గాయలపాలు అవుతున్నారు. ఇక ఆస్తినష్టం కూడా భారీగా జరుగుతోంది. ఇది చాలదన్నట్లు వర్షాల ధాటికి కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. 

read more  హైతిలో కుప్పకూలిన విమానం... ఒక్కరు కూడా మిగలకుండా దుర్మరణం

ఈ వర్షాలు మొదలైన 20రోజల వ్యవధిలో దేశవ్యాప్తంగా 38మంది చనిపోయినట్లు... మరో 50మంది గాయపడినట్లు ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ వెల్లడించారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్టు పేర్కొంది. అలాగే మరో 24మంది గల్లంతయినట్లు వెల్లడించారు. 

వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటంతో పాటు కొండ చరియల ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి నేపాల్ ఆర్మీ, అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రకృతి విలయతాండవంలో 790 ఇళ్లు నీట మునగగా పలు వంతెనలు ధ్వంసమైనట్టు నేపాల్ హోంమంత్రిత్వశాఖ పేర్కొంది.  

click me!