Nepal Plane Crash: అదృశ్యమైన తారా ఎయిర్ విమాన శకలాల గుర్తింపు

Siva Kodati |  
Published : May 29, 2022, 04:32 PM ISTUpdated : May 29, 2022, 04:35 PM IST
Nepal Plane Crash: అదృశ్యమైన తారా ఎయిర్ విమాన శకలాల గుర్తింపు

సారాంశం

నేపాల్‌లో అదృశ్యమైన తారా ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమాన శకలాలను ఆర్మీ గుర్తించింది. కొవాంగ్‌లో విమానం కూలిన ప్రదేశానికి సహాయక సిబ్బంది చేరుకున్నారు. 

నేపాల్‌లో అదృశ్యమైన తారా ఎయిర్ లైన్స్‌కు (Tara Air ) చెందిన విమానాన్ని గుర్తించారు. కొవాంగ్‌లో తారా ఎయిర్ విమాన శకలాలను సహాయక సిబ్బంది గుర్తించారు. ఆదివారం ఉదయం తారా ఎయిర్‌కు చెందిన 9 NAET ట్విన్‌ ఇంజిన్‌ విమానం ఆచూకీ గల్లంతైంది. ఈ విమానం పోఖారా నుంచి నేపాల్‌లోని జోమ్‌సోమ్‌కు వెళ్తుండగా ఉదయం 9.55 గంటలకు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయని అధికారులు ధృవీకరించారు. మరోవైపు.. విమానాన్ని ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ప్రాంతంలో మొద‌ట‌ గుర్తించామ‌ని, త‌ర్వాత‌ మౌంట్ ధౌలగిరి వైపు మళ్లింద‌ని.. ఆ తర్వాతే ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. 

Also Read:నేపాల్‌లో ఏటీసీతో సంబంధాలు కోల్పోయిన విమానం: ఫ్లైట్ లో 22 మంది ప్రయాణీకులు

కాగా, తప్పిపోయిన విమానంలో ముగ్గురు విమాన సిబ్బందితో సహా 19 మంది ప్రయాణీకులు ఉండగా.. వారిలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ జాతీయులు ఉన్నట్టు సమాచారం.  విమానం సిగ్నల్స్‌ కట్‌ అవడంతో గాలింపు చర్యల కోసం ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినట్టు తారా ఎయిర్ ప్రతినిధి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?