నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా

By narsimha lodeFirst Published Dec 24, 2018, 3:42 PM IST
Highlights

పాక్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు  కోర్టు సోమవారం నాడు ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు  కోర్టు సోమవారం నాడు ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో నవాజ్ షరీఫ్‌కు  జైలు శిక్షతో పాటు 25 మిలియన్ డాలర్ల జరిమానాను విధించింది కోర్టు.

ఈ కేసుకు సంబంధించి గత బుధవారం నాడు కొన్ని డాక్యుమెంట్లను సమర్పించేందుకు షరీఫ్ న్యాయవాది కోర్టును కోరారు. అయితే  ఇందు కోసం కనీసం వారం రోజుల పాటు సమయాన్ని నవాజ్ షరీఫ్ తరపు న్యాయవాది కోర్టును కోరారు.కానీ నవాజ్ షరీఫ్ తరపు న్యాయవాది అభ్యర్థననను కోర్టు  తోసిపుచ్చింది.

click me!