సునామీ...23,000 వేల ఆటంబాంబుల శక్తికి సమానం

By sivanagaprasad kodatiFirst Published Dec 24, 2018, 10:15 AM IST
Highlights

ఇండోనేషియాలో జావా, సుమత్రా దీవుల్లో వచ్చిన సునామీ ధాటికి సుమారు 281 మంది దుర్మరణం పాలవ్వడంతో మరోసారి ‘‘సునామీ’’ వార్తల్లో చర్చనీయాంశమైంది. అందరూ 2004 నాడు వచ్చిన సునామీ గురించి చర్చించుకుంటున్నారు. 

ఇండోనేషియాలో జావా, సుమత్రా దీవుల్లో వచ్చిన సునామీ ధాటికి సుమారు 281 మంది దుర్మరణం పాలవ్వడంతో మరోసారి ‘‘సునామీ’’ వార్తల్లో చర్చనీయాంశమైంది. అందరూ 2004 నాడు వచ్చిన సునామీ గురించి చర్చించుకుంటున్నారు.

నాడు సరిగ్గా కొత్త ఏడాదికి 5 రోజుల ముందు 2004 డిసెంబర్ 26 ఉదయం 7.59 గంటలకు ఇండోనేషియాలోని సుమిత్రా ద్వీపం వద్ద సముద్ర గర్భంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 9 శాతంగా నమోదైంది.

సముద్రంలోని ఇండియా ప్లేట్, బర్మా ప్లేట్ మధ్య ఘర్షణ ఏర్పడటంతో 1000 కిలోమీటర్ల పొడవు, పది మీటర్ల లోతు మేర పెద్ద చీలిక ఏర్పడింది. ఈ పరిణామంతో సముద్ర గర్భంలోని నీరు అతి భారీ పరిమాణంలో స్థానభ్రంశం చెందాయి.

ఇది జరిగిన కొన్ని గంటల్లోనే తీరంవైపుగా భారీ రాకాసి అలలు దూసుకొచ్చాయి. ఇవి ఎంతటి తీవ్రమైనవంటే రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన ఆటంబాంబు కంటే 23 వేల రెట్ల అధికమైన శక్తి విడుదలైందని అమెరికా జియోలాజికల్ సర్వే తేల్చింది.

రాకాసి అలలు హిందూ మహాసముద్రంలోని 11 దేశాల్లోని తీర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. దీని స్పీడు ఏ రేంజ్‌లో ఉందంటే సునామీ అలలు దాదాపు 5, 000 కి.మీ వరకూ ప్రయాణించి ఆఫ్రికా తీరంలో సైతం నష్టాన్ని కలగజేశాయి.

సునామీ గురించి సరైన అవగాహన లేని ఆ రోజుల్లో ప్రాణనష్టం భారీగా సంభవించింది. సాధారణ అలలుగానే భావించిన జనం తీరం వెంటే ఉండటంతో ప్రాణాలు కోల్పోయారు. సునామీ కారణంగా 14 దేశాలకు చెందిన 2,30,000 మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులై మానవజాతి చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విలయాల్లో ఒటిగా నిలిచింది.

అయితే ప్రకృతి ఉపద్రవాలను జంతువులు పసిగట్టగలవు అనేలా....సునామీ రావడానికి కొద్ది నిమిషాల ముందు జంతువులు తీర ప్రాంతం నుంచి దూరంగా పారిపోవడాన్ని చాలా చోట్ల గమనించారు.

click me!