
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ హెచ్చరిక చేసింది. ఓ భారీ గ్రహ శకలం భూమిని ఢీకొట్టబోతోందని తెలిపింది. 99 అడుగుల ఆస్టరాయిడ్ 21,840 KMPH వేగంగా భూమి వైపు దూసుకొస్తోందని వెల్లడించింది. ఇది భూమికి 34.90 లక్షల మైళ్ల దగ్గరగా వస్తుందని NASA తెలిపింది.
ఇప్పటికే 400 అడుగుల భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టకుండా పోయింది. ఆగస్టు 4న ఇది జరగ్గా... సరిగ్గా ఒక రోజు తర్వాత నేడు (ఆగస్టు 5 2024) మరో ఆస్టరాయిడ్ ముప్పు తలెత్తింది. 99 అడుగుల గ్రహశకలం భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్లు నాసా గుర్తించింది. ఈ గ్రహ శకలం భూమికి అత్యంత దగ్గరగా వస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో భూమికి దగ్గరగా వచ్చే అన్ని వస్తువులపై NASA నిఘా పెట్టింది. వాటి సామీప్యం, వేగం, అవి ప్రమాదకరమైనవా? కాదా? తదితర వివరాలను అందిస్తుంది.
కాగా, భూమివైపు దూసుకొస్తున్న 99 అడుగుల గ్రహశకలానికి 2023 HB7 అని నాసా పేరు పెట్టింది. అది భూమికి 34,90,000 మైళ్ల దూరంలో ఉంటుందని గుర్తించింది.
నాసా ఈ గ్రహశకలం గురించి మరిన్ని ఇతర వివరాలను కూడా పంచుకుంది. ఈ గ్రహశకలం ‘ఏటెన్’ గ్రహశకలాల సమూహానికి చెందినదిగా తెలిపింది. భూమికి సమీపంలో ఉన్న ఆస్టరాయిడ్ (NEO)గా వర్గీకరించింది. అయితే, దీన్ని మరీ అంత ప్రమాదకర గ్రహశకలం (PHA)గా పేర్కొనలేదు.
ఈ గ్రహశకలం వేగం ఆశ్చర్యకరంగా ఉంది. ఇది సెకనుకు 6.07 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. గంటకు 21,840 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ఈ గ్రహశకలం గురించి స్మాల్-బాడీ డేటాబేస్ లుకప్‌లో 1904లో తొలి ప్రస్తావించారు. నాసా డేటా ప్రకారం, ఈ గ్రహశకలం జూలై 2025లో భూమి వైపు తిరిగి వస్తుంది. ఆ సమయంలో అది మరింత వేగంగా ప్రయాణిస్తుంది. వచ్చే ఏడాదికి దాని వేగం 67,866 kmphకి పెరిగే ప్రమాదం ఉందని అంచనా. ఇది దాని ప్రస్తుత వేగం కంటే వాస్తవంగా మూడు రెట్లు ఎక్కువ.