నేపాల్‌లో విమానం క్రాష్.. గాల్లో కలిసిన 18 మంది ప్రాణాలు

By Galam Venkata Rao  |  First Published Jul 24, 2024, 12:46 PM IST

నేపాల్ రాజధాని ఖాట్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. విమానం రన్‌వే నుండి జారిపడిపోయి ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి, విమానం మొత్తం కాలిపోయింది.


నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యే క్రమంలో విమానం స్కిడ్ అయ్యి.. కుప్పకూలింది. ఎయిర్‌క్రూతో సహా 19 మంది ప్రయాణిస్తున్న శౌర్య ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం రిసార్ట్ టౌన్ పోఖారాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 18 మంది చనిపోయారు.

 

🚨🚨WATCH :Moments before Plane crashes at the Tribhuvan International Airport in Nepal's Kathmandu.

▪︎19 people were on board.

▪︎Highly unfortunate Incident. pic.twitter.com/LlS73QbQj5

— chikka 888 (@Rinku_41)

Latest Videos

undefined

తీవ్ర గాయాల పాలైన పైలట్‌ కెప్టెన్ ఎంఆర్ షాక్యాను ఆసుపత్రికి తరలించారు. కాగా, రన్‌వే నుంచి విమానం స్కిడ్ ఫెన్సింగ్‌ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో మంటలు చెలరేగి విమానం మొత్తం కాలిపోయింది. 

హుటాహుటిన రంగంలోకి దిగిన అత్యవసర సిబ్బంది.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. విమానం క్రాష్ అయిన నేపథ్యంలో త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు.

click me!