‘ఉల్ఫ్ మూన్’ ఫొటోలు షేర్ చేసిన నాసా..

By AN TeluguFirst Published Dec 31, 2020, 2:08 PM IST
Highlights

తాజాగా నాసా రిలీజ్ చేసిన చంద్రుడి ఫొటోలు వైరల్ గా మారాయి. ఉల్ఫ్ మూన్ గా పేర్కొంటూ ఈ ఫోటోలను అధికారిక ఇన్ స్ట్రా అకౌంట్ లో షేర్ చేసింది. 2020 ఏడాది ఇదే ఆఖరి పూర్ణ చంద్రుడు. అంతేకాదు ఇది ఈ ఏడాది 13వ సారి కనిపిస్తున్న పూర్ణ చంద్రుడి ఫోటోలు ఇవి. 

ఈ చంద్రుడు దాదాపు 3 రోజుల పాటు ఆకాశంలో దర్శనమిస్తాడు. అయితే దీనికి ‘ఉల్ఫ్ మూన్’ అని పేరు రావడానికి గల కారణాలను నాసా వివరించింది. అమెరికాలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో నివశించిన అల్గోన్‌క్విన్ ఆదిమవాసులు దీనిని ‘ఉల్ఫ్ మూన్’ అని పిలిచేవారని, అప్పటి నుంచి దీనిని అదే పేరుతో పిలవడం జరుగుతోందని నాసా పేర్కొంది. 

వారు అలా పిలవడానికి కారణం.. చలికాలంలో ఆకలితో ఉన్న తోడేళ్లు ఈ పూర్ణ చంద్రుడిని చూడగానే మూకుమ్మడిగా ఊళ వేసేవని అందుకే అలా పిలిచేవారని నాసా తెలిపింది. 
 
click me!