
న్యూఢిల్లీ: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ఈ రోజు విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ సేఫ్‌గా చంద్రుడి ఉపరితలంపై దిగింది. ఇది భారత ఖగోళ చరిత్రలోనే అత్యున్నతమైన మైలురాయి. దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దక్షిణ ధ్రువానికి సమీపంలో ఒక స్పేస్ క్రాఫ్ట్‌గాను విజయవంతంగా ల్యాండ్ చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అదే.. చంద్రుడిపై ఖగోళ నౌకను ల్యాండ్ చేసిన దేశాల్లో సోవియట్ యూనియన్, అమెరికా, చైనాల తర్వాత నాలుగో దేశంగా భారత్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని విదేశాలు సైతం ఆసక్తిగా వీక్షించాయి.
ఈ ఘన విజయానికి ఇస్రోకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతంతో ప్రపంచంలోనే అత్యంత ఫార్వర్డ్ స్పేస్ ఏజెన్సీగా చెప్పుకునే అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా కూడా ఇస్రో విజయానికి శుభాకాంక్షలు తెలిపింది..
Also Read: Hello Moon: దక్షిణ ధ్రువంపై తొలి దేశంగా ఇండియా.. ఈ 14 రోజులపైనే అందరి చూపు
నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ఇస్రోకు శుభాకాంక్షలు చెప్పారు. చంద్రయాన్ 3 లూనార్ దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కావడంపై శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా ఇండియాకు అభినందనలు తెలిపారు. ఈ మిషన్‌లో మీతో భాగస్వములుగా ఉన్నందుకు సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు.