వజ్రాల వేట: ఆ గ్రామానికి పోటెత్తిన వేల మంది.. పగలు, రాత్రి తవ్వడమే

By Siva KodatiFirst Published Jun 21, 2021, 3:53 PM IST
Highlights

కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాలు తీవ్ర ఇక్కట్లును ఎదుర్కొంటున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల ఆర్ధిక సంక్షోభంతో పాటు ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి. సంపన్న దేశాలే నానా ఇబ్బందులు పడుతుంటే.. పేద దేశాల పరిస్ధితి మరింత దిగజారుతోంది. 

కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాలు తీవ్ర ఇక్కట్లును ఎదుర్కొంటున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల ఆర్ధిక సంక్షోభంతో పాటు ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి. సంపన్న దేశాలే నానా ఇబ్బందులు పడుతుంటే.. పేద దేశాల పరిస్ధితి మరింత దిగజారుతోంది. తాజాగా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో మునిగిపోయిన ఆఫ్రికా దేశం దక్షిణాఫ్రికాను మరో సమస్య వేధిస్తుంది. అక్కడ ఓ చిన్న కుగ్రామంలో వేల మంది ప్రజలు కోవిడ్ నిబంధనలు అతిక్రమించి గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.

ఇందుకు కారణం లేకపోలేదు. ఆ గ్రామంలో విలువైన వజ్రాలు దొరుకుతాయనే ఆశతో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ.. ఆ గ్రామానికి తండోపతండాలుగా పోటెత్తుతున్నారు. అయితే, ప్రజల్ని కానీ, తవ్వకాల్ని కానీ కట్టడి చేయడంలో స్థానిక యంత్రాంగం విఫలమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు దేశంలోని ప్రస్తుత పరిస్ధితి దృష్ట్యా ఇంతమంది ఒకేసారి గుమిగూడడంతో కోవిడ్ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:ఫైజర్, మోడెర్నా టీకాలతో వీర్యకణాల సంఖ్య తగ్గుతుందా?

కాగా, కోవిడ్ ఎఫెక్ట్‌తో దక్షణాఫ్రికా ఆర్ధిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది ప్రజలు పేదరికంలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ తలరాతను మార్చుకునేందుకు వజ్రాల వేటను ముమ్మరం చేస్తున్నారు. అయితే, వారం రోజుల నుంచి తవ్వకాల్లో దొరుకుతున్నవి వజ్రాలా కాదా అనేది తేల్చడంలో జియాలజిస్టులు విఫలమవుతున్నారు. అయినప్పటికీ ఆశచావని స్థానికులు మాత్రం వజ్రాల కోసం పగలు రాత్రి తేడా లేకుండా తవ్వకాలు కొనసాగిస్తూనే ఉన్నారు

click me!