మయన్మార్‌: సైనిక ప్రభుత్వ సంచలన నిర్ణయం.. ప్రజల గొంతు నొక్కేలా ఆదేశాలు

Siva Kodati |  
Published : Feb 14, 2021, 09:30 PM IST
మయన్మార్‌: సైనిక ప్రభుత్వ సంచలన నిర్ణయం.. ప్రజల గొంతు నొక్కేలా ఆదేశాలు

సారాంశం

మయన్మార్‌లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని కైవసం చేసుకున్న సైనిక ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి పౌరుల వ్యక్తిగత హక్కులను కాలరాసే దిశగా అడుగు వేసింది.

మయన్మార్‌లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని కైవసం చేసుకున్న సైనిక ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి పౌరుల వ్యక్తిగత హక్కులను కాలరాసే దిశగా అడుగు వేసింది.

ఇప్పటికే దేశాధ్యక్షుడు యూ విన్‌ మింట్‌, ప్రభుత్వ నేత ఆంగ్‌ సాన్‌ సూకిలతో సహా పలువురిని సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం పౌర నిరసనలను కట్టడి చేసేందుకు పలురకాలుగా ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేందుకు సైనిక సర్కార్ యత్నించింది. ప్రజల వ్యక్తిగత స్వాతంత్ర్యం, భద్రతలకు రక్షణ కల్పించే చట్టాలను సవరిస్తూ భద్రతా దళాల కమాండర్‌ ఇన్‌ చీఫ్‌, సైనిక ప్రభుత్వ నేత సెన్‌ జెన్‌ మిన్‌ యాంగ్‌ లయింగ్‌  ఆదేశాలు జారీ చేశారు.  

దీని ప్రకారం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రతల రక్షణ చట్టం లోని 5,7,8 సెక్షన్లను రద్దు చేశారు. ఈ ఆదేశాలు దేశంలోని అత్యవసర పరిస్ధితి విధించిన ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయని లయింగ్ తన ఆదేశాల్లో వెల్లడించారు. మరోవైపు మయన్మార్‌ సైనిక ప్రభుత్వ తాజా చర్య  పట్ల జాతీయ, అంతర్జాతీయ సమాజం మండిపడుతోంది. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?