టెక్సాస్‌ ప్రమాదం : ఒకదానికొకటి ఢీ కొన్న వందకార్లు, ఐదుగురు మృతి

By AN TeluguFirst Published Feb 12, 2021, 12:07 PM IST
Highlights

అమెరికాలోని టెక్సాస్ లో ఘోర ప్రమాదం జరిగింది. వంద వాహనాలు ఒకదానికొకటి గుద్దుకోవడంతో రోడ్డు మీద బీభత్సం సృష్టించబడింది. దీంతో మైలున్నర మేర చిందరవందరగా వాహనాలు పడిపోయాయి. మైళ్ల కొద్దీ ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. 

అమెరికాలోని టెక్సాస్ లో ఘోర ప్రమాదం జరిగింది. వంద వాహనాలు ఒకదానికొకటి గుద్దుకోవడంతో రోడ్డు మీద బీభత్సం సృష్టించబడింది. దీంతో మైలున్నర మేర చిందరవందరగా వాహనాలు పడిపోయాయి. మైళ్ల కొద్దీ ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. 

ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా సుమారు 50మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన మంచు తుపానే ఈ ప్రమాదానికి కారణం. మంచు తుపాను వల్ల రహదారిపై వాహనాల టైర్లు పట్టు కోల్పోయి కనీవినీ ఎరగని రీతిలో ఈ ప్రమాదానికి దారితీసింది.

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం ఫోర్త్‌విత్‌ సమీపంలో 35వ అంతర్రాష్ట్రీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద ప్రదేశానికి చేరుకున్న సహాయక సిబ్బంది ఒక్కో వాహనాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. అందులో చిక్కుకున్న వారిని బైటికి తీసి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. 

ప్రమాదంలో దెబ్బతిన్న వాహనాలను పక్కకు తరలిస్తున్నారు. వేగంగా వచ్చి ఒకదానివెంట ఒకటి ఢీ కొట్టుకోవడంతో చాలా వరకు వాహనాలు నుజ్జునుజ్జయి పోయాయి. ఈ మార్గంలో జారుడుగా ఉండడంతో రాకపోకలు సాగించేందుకు సహాయక సిబ్బంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ ప్రమాదంలో క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుందని యంత్రాంగం తెలిపింది. మొదట ఫెడెక్స్ కు చెందిన ట్రక్కు ఒకటి అదుపుతప్పి బారియర్ ను ఢీ కొట్టి ఆగిపోయింది. వెనకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొట్టి ఆగిపోవడంతో ప్రమాదాల పరంపర మొదలైనట్లు భావిస్తున్నారు. 

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో షిర్లీ మంచు తుపాను కారణంగా  జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. తుపాను ప్రభావంతో కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లోని సుమారు 1.25 లక్షల నివాసాలు, వాణిజ్యప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

click me!