నా రాజకీయ ఉద్యమం ఇప్పుడే మొదలైంది: ట్రంప్

Published : Feb 14, 2021, 12:04 PM IST
నా రాజకీయ ఉద్యమం ఇప్పుడే మొదలైంది: ట్రంప్

సారాంశం

తన రాజకీయ ఉద్యమం ఇప్పుడే మొదలైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 

వాషింగ్టన్: తన రాజకీయ ఉద్యమం ఇప్పుడే మొదలైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అభిశంసన నుండి ట్రంప్ గట్టెక్కాడు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అమెరికాను మళ్లీ ఉన్నతంగా మార్చేందుకు చారిత్రక, దేశభక్తి పూర్వకమైన గొప్ప ఉద్యమం ఇప్పుడే మొదలైందన్నారు.

త్వరలోనే తాను మీతో చాలా విషయాలు పంచుకొంటానని ఆయన చెప్పారు. భవిష్యత్తులో చేయాల్సిన కృషి ఎంతో ఉంది, అందరూ సమైఖ్యంగా సాధించాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఇందుకు తాను తన అసమానమైన ప్రయాణాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ట్రంప్ పై అమెరికా సెనెట్ లో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో ట్రంప్ నకు అనుకూలంగా 57 మంది, వ్యతిరేకంగా 43 మంది ఓటు చేశారు. ట్రంప్ నకు వ్యతిరేకంగా స్వంత పార్టీకి చెందిన రిపబ్లికన్ పార్టీకి చెందిన ఏడుగురు ఓటేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యాడు. ట్రంప్ స్థానంలో జో బైడెన్ ఇటీవలనే  అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ట్రంప్ తీసుకొన్న చాలా నిర్ణయాలను బైడెన్ వెనక్కి తీసుకొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?