కెనడాలో రక్తపాతం.. కత్తి దాడిలో 10 మంది దుర్మరణం.. 15 మంది క్షతగాత్రులు

By Mahesh KFirst Published Sep 5, 2022, 5:53 AM IST
Highlights

కెనడాలో రక్తపాతం ఏరులై పారింది. పది మంది కత్తిపోట్లకు గురై ప్రాణాలు వదిలారు. కనీసం 15 మంది గాయపడ్డారు.

న్యూఢిల్లీ: కెనడా దేశం రక్తసిక్తమైంది. అక్కడ జరిగిన కత్తిదాడిలో పది మంది దుర్మరణం చెందారు.కనీసం మరో 15 మంది గాయపడ్డరు. పోలీసులు రంగంలోకి దిగారు. పలు ప్రావిన్స్‌లలో ఇద్దరు దుండగుల కోసం గాలింపులు మొదలు పెట్టినట్టు వారు వివరించారు. 

సస్కాచెవాన్‌లో 13 లొకేషన్‌లలో 10 మంది మృతదేహాలను గుర్తించామని పోలీసులు వివరించారు. మరెందరో ప్రజలు గాయపడ్డారని తెలిపారు. కనీసం 15 మంది ఈ కత్తి దాడుల్లో మరణించారు.

సస్కాచెవన్‌లో ఉదయం పర్సనల్ అలర్ట్ జారీ చేశారు. వెల్డన్ సమీపంలోని ఓ టౌన్‌లో మూలవాసి కమ్యూనిటీకి చెందిన వారిపై ఈ దాడులు జరిగాయని పోలీసు వ్యవస్థ చెబుతున్నది.

ఈ ఘటనకు సంబంధించి తమకు మొదటి కాల్ ఉదయం 5.40 గంటలు లేదా 11.40 జీఎంటీ సమయంలో కాల్ వచ్చిందని పోలీసు అధికారి రొండా బ్లాక్ మోర్ తెలిపారు. ఆ తర్వాత వరుసగా పలు చోట్ల నుంచి కాత్తి దాడుల గురించి తమకు సమాచారం వచ్చిందని వివరించారు. కొంత మంది బాధితుల లక్ష్యంగా ఈ దాడి జరిగి ఉంటుందని, ఇతరులను ర్యాండమ్‌గా చంపేసి ఉంటారని తెలిపారు. 

నిందితులు ఇద్దరు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వారు నిస్సాన్ రోగ్ కారులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చారు. అపరిచితులను తమ దరికి రానివ్వ వద్దని అన్నారు. అలాగే, పరిచయం లేని వారికి తమ వాహనాల్లో లిఫ్ట్ ఇవ్వరాదని వివరించింది. 

ప్రొవిన్షయల్ క్యాపిటల్ రెజీనాలో ఇద్దరు నిందితులు ఉన్నట్టు కొన్ని రిపోర్టులు వచ్చాయి. దీంతో సరిహ్దదు ప్రావిన్స్‌లు మనితోబా, అర్బర్టా ప్రావిన్స్ ‌లలోనూ గాలింపులు మొదలపెట్టారు.

సస్కాచెవాన్‌ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఎమర్జెన్సీ ప్రోటొకాల్‌ను ప్రకటించింది. తద్వారా ఎక్కువ మందికి ఎమర్జెన్సీ చికి్త్స అందించే వీలు కలుగుతుంది. 

ఈ ఘటనను తాము ధ్రువీకరిస్తున్నామని, పలు చోట్ల జరిగిన దాడుల్లో బాధితులకు చికిత్స అందించడానికి అదనంగా మల్టిపుల్ ఎజన్సీలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. 

click me!