ఎవరెస్ట్ ఎక్కామంటూ తప్పుడు పత్రాలు.. భారతీయ పర్వతారోహకులపై నేపాల్ నిషేధం...

By AN TeluguFirst Published Feb 12, 2021, 10:10 AM IST
Highlights

భారత్ కు చెందిన ఇద్దరు మౌంటనీర్స్ కి నేపాల్ ప్రభుత్వం షాకిచ్చింది. వారిమీద ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తప్పుడు పత్రాలు సమర్పించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. 
 

భారత్ కు చెందిన ఇద్దరు మౌంటనీర్స్ కి నేపాల్ ప్రభుత్వం షాకిచ్చింది. వారిమీద ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తప్పుడు పత్రాలు సమర్పించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. 

వివరాల్లోకి వెడితే.. నేపాల్ ప్రభుత్వం హర్యానాకు చెందిన నరేందర్ సింగ్ యాదవ్, సీమా రాణిపై ఆరు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. నరేందర్ సింగ్ యాదవ్, సీమా రాణి 2016లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించామని తెలిపారు. 

దీనికి సంబంధించిన ఫోటోలను ఆధారాలుగా చూపడంతో నేపాల్‌ ప్రభుత్వం వారికి ధృవీకరణ పత్రాలను అందించింది. ఆ తరువాత వారి వ్యవహారశైలిపై ఎందుకో నేపాల్ ప్రభుత్వానికి అనుమానం వచ్చింది.

అంతే వీరిపై విచారణకు ఆదేశించారు. విచారణలో నరేందర్ సింగ్ యాదవ్, సీమా రాణి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించలేదని తేలింది. దీంతో నేపాల్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏకంగా ప్రభుత్వాన్నే మోసం చేయడానికి ప్రయత్నించారంటూ వీరిపై ఆరు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది నేపాల్ ప్రభుత్వం. 


 

click me!