ఐదేళ్ల కూతురిని ఇంట్లోంచి గెంటేసిన తల్లి.. చిన్నారిపై అత్యాచారం, హత్య...

By SumaBala Bukka  |  First Published Oct 9, 2023, 2:11 PM IST

ఐదేళ్ల వయసున్న చిన్నారిని ఇంట్లోనుంచి వెళ్లగొట్టిందో తల్లి. ఆ చిన్నారి మీద అత్యాచారం చేసి, దారుణంగా హతమార్చాడో దుండగుడు. 


అమెరికా : ఐదేళ్ల కూతురిని ఇంట్లోనుంచి వెళ్లగొట్టిందో కన్నతల్లి. కూతురితోపాటు మిగతా కుటుంబసభ్యులను కూడా గెంటేసింది. దీంతో వారు సమీపంలోని క్యాంప్‌సైట్‌లో ఆశ్రయం పొందారు. ఆ ఐదేళ్ల చిన్నారి మీద అత్యాచారం చేసి, హత్య చేశాడో నిందితుడు. దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

బాధిత చిన్నారి పేరు జోయ్ ఫెలిక్స్ సోమవారం ప్రాణాంతక గాయాలతో గ్యాస్ స్టేషన్ దగ్గర ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన అమెరికాలోని కాన్సాస్‌లో వెలుగు చూసింది.  ఐదేళ్ల బాలిక తల్లి ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ఇంటి నుండి బయటకు వెళ్లగొట్టింది. 

Latest Videos

undefined

ఇజ్రాయెల్ కు అండగా అమెరికా.. యుద్ధనౌకలు, విమానాలు పంపించిన అగ్రరాజ్యం.. వ్యతిరేకించిన హమాస్

దీంతో నిరాశ్రయులైన వారంతా క్యాంప్‌సైట్‌లో తలదాచుకున్నారు. అక్కడే ఐదేళ్ల జోయ్ మీద అత్యాచారం చేసి హత్య చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. నిందితుడిని మికెల్ డబ్ల్యూ చెర్రీ (25) గా గుర్తించి,  మంగళవారం అరెస్టు చేశారు. అతని మీద హత్య, అత్యాచారం అభియోగాలు మోపారు, స్థానిక వార్తా సంస్థకథనాల ప్రకారం అతను రెండు మిలియన్ల డాలర్ల బాండ్‌పై ఉంచబడ్డాడు.

నిందితుడు  చెర్రీ కూడా ఇంతకుముందు జోయి, ఆమె తల్లిదండ్రులతో పాటు అదే ఇంట్లో ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. జోయి తల్లి తన కుమార్తెను, కుటుంబ సభ్యులను ఇంటి నుండి బయటకు నెట్టివేసిందని, వారు సమీపంలోని క్యాంప్‌సైట్‌లో ఉంటున్నారని వారు చెప్పారు.

నిందితుడు చెర్రీకి, జోయ్ తల్లికి మధ్య ఎలాంటి సంబంధం ఉందో తెలియదన్నారు. స్థానికుల చెబుతున్నదాని ప్రకారం.. జోయ్ ఇంట్లో చాలా హింస అనుభవించింది. ఆమెను ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. ఆమెకు స్నానం చేయించడం, ఆహారం ఇవ్వడం, దుస్తులు ఇలాంటి విషయాల్లో చాలా నిర్లక్ష్యం ఎదుర్కుంది. ఆమె పాఠశాలకు కూడా వెళ్లలేదని వారు తెలిపారు.

జోయ్ చనిపోవడానికి కొన్ని వారాల ముందు.. ఇరుగుపొరుగువారు జోయ్ ఎదుర్కుంటున్న ఈ దుర్భర పరిస్థితులపై కాన్సాస్ పిల్లలు, కుటుంబాల సంక్షేమ అధికారులకుఅనేక ఫిర్యాదులు చేశారు. వారి పక్కింటి వ్యక్తి అయిన షారన్ విలియమ్స్ మాట్లాడుతూ.. "జోయ్ ఎవరి దగ్గరో ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఆమె ఇల్లు. ఒకరు, ఇద్దరు కాదు మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ఇంట్లో.. ఆమె కోసం ఏదైనా చేయచ్చు" అని చెప్పారు. 

జోయి తల్లిపై 2018లో ఒక బిడ్డను ప్రాణాంతకమైన ఆయుధంతో శారీరక హాని కలిగించిన నేరంకూడా ఉంది. ఈ నేరాన్ని ఆమె అంగీకరించింది కూడా.  ఈ మేరకు కోర్టు పత్రాలు టోపెకా క్యాపిటల్-జర్నల్ వెల్లడించాయి.

click me!