
Yoga Festival: భారత్ లో పుట్టిన యోగికు అంతర్జాతీయంగా మరింత ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా(Saudi Arabia)లో తొలిసారి యోగా ఫెస్టివల్ జరిగింది. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీలోని జుమాన్ పార్క్‌లో 1,000 మందికి పైగా ప్రజలు ఈ యోగి ఫెస్టివల్ (Yoga Festival)లో పాల్గొన్నారు. దేశంలో (Saudi Arabia) మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న ఈ యోగా ఫెస్టివల్ జనవరి 29న ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 1వరకు కొనసాగనుంది. బే లా సన్ బీచ్‌లో శనివారం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రవాస భారతీయులు(NRIs) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు(Yogasanas) వేశారు. దేశంలో యోగాను ప్రోత్సహించేందుకు సౌదీ అరేబియా యోగా కమిటీ తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నాలుగు రోజుల పాటు ఈ యోగి ఫెస్టివల్ జరగనుంది. యోగా ఫెస్టివల్‌కు తాము ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందన లభిస్తోందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
సౌదీ అరేబియా (Saudi Arabia) యోగా కమిటీ ఈ కార్యక్రమాన్ని(Yoga Festival) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దేశంలో ఉన్న యోగా గురువులు పాలుపంచుకున్నారు. ప్రజలు సైతం చాలా ప్రాంతాలను నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సౌదీ అరేబియా దేశ నలుమూలల నుంచి పలువురు పాల్గొని తమ యోగాసనాలతో చూపరులను అలరించారు. యోగా నిపుణులు తమ శిష్యుల చేత యోగాసనాలను ప్రదర్శింపజేశారు. కాగా, సౌదీ యోగా కమిటీని 2021 మే 16న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సౌదీ అరేబియాలో యోగాను ప్రోత్సహించడానికి సౌదీ అరేబియా ఒలింపిక్ కమిటీ, క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన చిన్న సమాఖ్యలాగా స్వతంత్రంగా పనిచేసే ప్రభుత్వ సంస్థ ఇది. నౌఫ్ అల్మార్వాయ్ (Nouf AlMarwaai ) ఈ సంస్థకు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. సౌదీ యోగా కమిటీతో ఆయూష్, క్రీడా మంత్రిత్వ శాఖల (AYUSH Ministry and the Sports Ministry)తో ప్రత్యేక MOU కూడా కుదిరింది. 2021లో యోగా దినోత్సవం సందర్భంగా సౌదీ అరేబియా-భారతదేశం మధ్య కుదిరిన ఈ ఒప్పందం యోగా చరిత్రలో కీలకమైన ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే ఒప్పందం అని చెప్పాలి.
ఇక ప్రస్తుతం కొనసాగుతున్న సౌదీ అరేబియా యోగా ఫెస్టివల్ (Yoga Festival) లో చిన్నారులతో పాటు యువతీయువకులు, పెద్దలు పాలుపంచుకుంటున్నారు. విభిన్నమైన అనేక రకాల యోగాసనాలు ప్రదర్శిస్తున్నారు. యోగా ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమంలో యోగా గురువు మురళీ కృష్ణ (Murali Krishnan) పెద్దలకు నాయకత్వం వహించారు. చిన్నారులకు సారా అలమౌడి (Sara Alamoudi) ప్రాతినిధ్యం వహించారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సౌదీ అరేబియా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో తొలిసారిగా పాల్గొని పతకం సాధించిన యువ యోగి ఆరవ్ ప్రదిషా (Arav Pradisha)ను సత్కరించారు. ఆయన సౌదీలో ఉన్న ప్రవాస భారతీయుడు. అలాగే, సౌదీ యోగా కమిటీ బృందంలో సభ్యుడుగా ఉన్నారు. భారతీయ యోగా గురువు ఇరుమ్ ఖాన్ కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆమె 2008 నుండి సౌదీ అరేబియాలో యోగా టీచర్ కొనసాగుతున్నారు. గత 20 ఏళ్లుగా సౌదీ అరేబియాలో యోగాకు ప్రాముఖ్యత పెరుగుతున్నట్లు సౌదీ యోగా కమిటీ చీఫ్ నౌఫ్ బింత్ ముహమ్మద్ అల్-మరోయి అన్నారు.