హెచ్ఐవీ పేషెంట్‌కు కరోనా.. రికవరీకి 9 నెలలు.. ఈ కాలంలో వైరస్ 21 మ్యుటేషన్లు

Published : Jan 31, 2022, 12:41 PM IST
హెచ్ఐవీ పేషెంట్‌కు కరోనా.. రికవరీకి 9 నెలలు.. ఈ కాలంలో వైరస్ 21 మ్యుటేషన్లు

సారాంశం

దక్షిణాఫ్రికాలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. హెచ్‌ఐవీ సోకిన ఓ యువతి సరైన వైద్యం తీసుకోవడం లేదు. ఆ యువతికి కరోనా వైరస్ సోకింది. రోగ నిరోధక శక్తి మందగించిన ఆమె కరోనా నుంచి సులువగా కోలుకోలేదు. కొన్ని నెలల పాటు కరోనాను మోస్తూనే ఉన్నది. ఈ కాలంలో ఆ వైరస్ ఆమె బాడీలో మరింత బలోపేతం అయింది. 21 సార్లు మ్యుటేషన్లు పొందింది. హెచ్‌ఐవీ విరుగుడుకు, రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి యాంటీ రిట్రోవైరల్ మెడికేషన్ అందించగా ఆరు నుంచి తొమ్మిది వారాల్లో ఆమె కరోనా నుంచి రికవరీ అయ్యారు.   

న్యూఢిల్లీ: కరోనా(Coronavirus) గురించి మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. రోగ నిరోధక(Immunity) శక్తి స్వల్పంగా ఉన్నవారికి కరోనా వైరస్ సోకితే.. అది అంత తొందరగా నయం కాకపోవడమే కాదు.. ఆ దేహాన్ని ఆశ్రయంగా చేసుకుని మరింత రాటు దేలుతుందనే వాదనలను బలపరిచే ఓ ఆధారం ముందుకు వచ్చింది. దక్షిణాఫ్రికా(South Africa)లో హెచ్‌ఐవీ(HIV) సోకిన ఓ మహిళ సరైన చికిత్స తీసుకోవడం లేదు. తద్వార ఆమెలో రోగ నిరోధక శక్తి క్షీణ దశలోనే ఉండిపోయింది. అలాంటి ఆ మహిళకు కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్‌ను ఎదుర్కోవాలంటే సరిపడా రోగ నిరోధక శక్తి అవసరమే. కానీ, ఆమెలో కరోనా వైరస్‌నూ జయించే శక్తి లేదు. దీంతో ఆ వైరస్ ఆమెలో తొమ్మిది నెలలు జీవించ గలిగింది. అంతేకాదు, ఈ కాలంలో అది మరింత పదును తేలింది. ఆ వైరస్ ఆమె బాడీలో ఏకంగా 21 మ్యుటేషన్లు పొందింది.

స్టెల్లాన్‌బోష్ యూనివర్సిటీ, క్వాజులు నాటల్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఓ కేసును పరిశోధించాయి. అందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్‌ఐవీ సోకిన ఆ 22 ఏళ్ల యువతికి యాంటీ రిట్రోవైరల్ మెడికేషన్ అందించారు. హెచ్‌ఐవీ తీవ్రతను తగ్గించడానికి, అలాగే, ఆమె రోగ నిరోధక శక్తిని పరిపుష్టం చేయడానికి ఈ మెడికేషన్ ఇచ్చారు. దీంతో ఆమె ఆరు నుంచి తొమ్మిది వారాల్లో వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ పరిశోధనను ఇంకా పీర్ రివ్యూ చేయలేదు.

వ్యాధి నిరోధక శక్తి మందగించిన వారికి, హెచ్‌ఐవీ సోకినా చికిత్స తీసుకోవాని వారికి కరోనా వైరస్ సోకితే.. వారిలో వైరస్ ఎక్కువ ఉత్పరివర్తనాలు పొందుతుందని, తద్వార అది మరింత బలోపేతం అవుతుందని ఇప్పటికే నిపుణుల్లో వాదనలు ఉన్నాయి. తద్వార ఆ ఉత్పరివర్తనాలతో వైరస్‌లో కొత్త వేరియంట్ కూడా వచ్చే ముప్పు ఉంటుందని వాదిస్తున్నారు. ఈ వాదనలకు బలం చేకూరేలా ఈ కేసు ముందుకు వచ్చింది.  దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా వెలుగు చూసినట్టే.. బీటా వేరియంట్ కూడా ఇక్కడే మొదటిసారిగా రిపోర్ట్ అయింది. ఈ రెండు యూనివర్సిటీలు పరిశోధించిన ఆ మహిళలలోనూ తొలిసారిగా ఈ బీటా వేరియంట్ వెలుగు చూడటం గమనార్హం.

ఆ మహిళ బాడీలో కరోనా వైరస్ ఉన్న తొమ్మిది నెలల్లో 21 సార్లు ఉత్పరివర్తం చెందింది. ఇందులో స్పైక్ ప్రోటీన్‌లోనే 10 మ్యుటేషన్లు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. వైరస్‌లోని ఈ  స్పైక్ ప్రోటీనే దాన్ని మన దేహంలోని అవయవాలను గట్టిగా పట్టుకుని ఉంచడానికి ఉపయోగిపడతాయి.

హెచ్‌ఐవీ వైరస్ దక్షిణాఫ్రికాలో ఎక్కువగా ప్రబలుతున్నది. ఇక్కడి 6 కోట్ల జనాభాలో 82 లక్షల మంది హెచ్‌ఐవీ బారిన పడ్డారు. ఈ వైరస్ మనిషి రోగ నిరోధక శక్తిని బలహీన పరుస్తుంది.

ఇదిలా ఉండగా, బ్రెజిల్‌లో విలక్షణ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ ఇంక్యుబేటర్ పీరియడ్ 14 రోజులు. బ్రెజిల్ కు చెందిన ఓ ముగ్గురిలో ఈ వైరస్ అంతకు మించి ఎక్కువ రోజులు యాక్టివ్‌గా ఉన్నట్టు నిపుణులు తేల్చారు.వారికి నిరంతరాయంగా 70 రోజుల పాటు వైరస్ పాజిటివ్ రిపోర్ట్ వస్తూనే ఉందని అధ్యయన నివేదికలో తేలింది.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !