నిన్న కుప్పకూలిన విమానం.. ఇండోనేషియాలో నేడు మరో విషాదం

By Siva KodatiFirst Published Jan 10, 2021, 2:36 PM IST
Highlights

ఇండోనేషియాను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే శ్రీ విజయ విమానం కూలిపోయిన ఘటనలో 62 మంది జల సమాధి అయిన సంగతి తెలిసిందే. 

ఇండోనేషియాను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే శ్రీ విజయ విమానం కూలిపోయిన ఘటనలో 62 మంది జల సమాధి అయిన సంగతి తెలిసిందే.

తాజాగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారి పక్కన కొండచరియలు విరిగిపడి 12 మంది మృతిచెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అయితే మట్టి పెళ్లల కింద కొందరు చిక్కుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం  . ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు.. సహాయక చర్యలు చేపట్టారు. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు.

ఈ ఘటనలో రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఇండోనేషియాలో అధిక సంఖ్యలో ప్రజలు కొండ ప్రాంతాలు, నదీ తీరప్రాంతాల్లో నివసిస్తుండడం వల్ల ఏటా వర్షాకాలంలో ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు.  

ఇదిలా ఉండగా.. లా నినా ప్రభావంతో దేశంలో వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని గతేడాది అక్టోబరులోనే ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడా హెచ్చరించారు.

మార్చి వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైడ్రోమెటోరోలాజికల్ విపత్తును ఎదుర్కొడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

click me!