మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం.. ‘‘ఆర్డర్ ఆఫ్ ది నైల్‌’’తో సత్కరించిన ఆ దేశ అధ్యక్షుడు

Published : Jun 25, 2023, 03:54 PM IST
మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం.. ‘‘ఆర్డర్ ఆఫ్ ది నైల్‌’’తో సత్కరించిన ఆ దేశ అధ్యక్షుడు

సారాంశం

ఈజిప్టు ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘‘ది ఆర్డర్ ఆఫ్ ది నైల్’’తో సత్కరించింది.

భారతదేశానికి మరో గౌరవం దక్కింది. ప్రధాని  నరేంద్ర మోదీ ప్రస్తుతం రెండు రోజుల ఈజిప్ట్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈజిప్టు ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘‘ది ఆర్డర్ ఆఫ్ ది నైల్’’తో సత్కరించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ప్రధానమంత్రి మోదీకి ఈ పురస్కారాన్ని అందజేశారు. నరేంద్ర మోదీ అందుకున్న 13వ అత్యున్నత రాష్ట్ర గౌరవం ఇది. ఇది.. ప్రపంచంలోని వివిధ దేశాలు ప్రధాని మోదీకి ప్రదానం చేసిన 13వ అత్యున్నత పురస్కారం.  

గత తొమ్మిదేళ్ల పదవీకాలంలో ప్రధాని మోదీ.. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహు, కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ, రిపబ్లిక్ ఆఫ్ పలావ్ ద్వారా ఎబాకల్ అవార్డులతో సహా అనేక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు.

ఇదిలాఉంటే, ప్రధానమంత్రి మోదీ ఈజిప్ట్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అలాగే 1997 తర్వాత భారత ప్రధాని ఒకరు ఈజిప్టులో పర్యటిస్తుండటం కూడా ఇది మొదటిసారి. ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లారు.  ఇక, ఈజిప్టులోని కైరోలో ఆదివారం ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు ఎల్-సిసి అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశారు. ఇంకా..
ఈజిప్టులోని కైరోలోని హెలియోపోలిస్ యుద్ధ శ్మశానవాటికను సందర్శించిన ప్రధాని మోదీ.. మొదటి ప్రపంచ యుద్ధంలో అత్యున్నత త్యాగాలు చేసిన భారతీయ సైనికులకు నివాళులర్పించారు.

అలాగే.. ప్రధాని మోదీ కైరోలోని అల్-హకీమ్ మసీదును సందర్శించారు. అల్-హకీమ్ మసీదు ఈజిప్టులోని కైరోలో 11వ శతాబ్దపు ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశం. ఈ మసీదు భారతదేశ, ఈజిప్ట్ పంచుకున్న గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..