మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ 2018 విడుదల; ధర, ఫీచర్లు, ఇతర వివరాలు

Published : Jun 23, 2018, 10:33 AM IST
మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ 2018 విడుదల; ధర, ఫీచర్లు, ఇతర వివరాలు

సారాంశం

మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ 2018 విడుదల; ధర, ఫీచర్లు, ఇతర వివరాలు

జపాన్‌‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మిత్సుబిషి భారత విపణిలో ఓ సరికొత్త కారును ప్రవేశపెట్టింది. ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్లో మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ 2018 మోడల్ ఔట్‌ల్యాండర్‌లో అనేక అధునాత ఫీచర్లను పొందుపరచారు. ఈ కారును పూర్తిగా విదేశాల్లోనే తయారు చేసి ఇక్కడి మార్కెట్లోకి దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. ఫలితంగా దీని ధర కూడా అధికంగానే ఉండనుంది.

మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ 2018 ఎస్‌యూవీ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది. ప్రస్తుతానికి ఇందులో డీజిల్ వెర్షన్ అందుబాటులో లేదు. బానెట్ క్రింద అమర్చిన 2.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 164 బిహెచ్‌పిల శక్తిని, 222ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. 

ఈ కారులో మొత్తం ఏడు సీట్లు ఉంటాయి. అధిక లగేజ్ స్పేస్ కావాలనుకుంటే వెనుక రెండు వరుసలలోని సీట్లను పూర్తిగా మడిచేయవచ్చు. ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో 6.1-అంగుళాల టచ్‌స్క్రీన్-ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, 710వాట్ రాక్‌ఫోర్డ్ సౌండ్ సిస్టమ్, ప్రీమియం లెథర్ సీట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో దీని ధరను రూ.31.54 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
 

PREV
click me!

Recommended Stories

Fake Doctors : పాకిస్థాన్ మొత్తం శంకర్ దాదా ఎంబిబిఎస్ లే.. ఎంతమంది నకిలీ డాక్టర్లున్నారో తెలుసా?
భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు