భార్య జాకెట్ తెచ్చిన తంటా.. ట్రంప్ ఏమన్నారంటే..

Published : Jun 23, 2018, 09:01 AM IST
భార్య జాకెట్ తెచ్చిన తంటా.. ట్రంప్ ఏమన్నారంటే..

సారాంశం

అమెరికా ప్రథమ మహిళ (ఫస్ట్ లేడీ) మెలానియా ట్రంప్ ధరించిన జాకెట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అమెరికా ప్రథమ మహిళ (ఫస్ట్ లేడీ) మెలానియా ట్రంప్ ధరించిన జాకెట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ట్రంప్ ఫ్యామిలీ సెపరేషన్ విధానంలో భాగంగా టెక్సాస్ సరిహద్దులో బందీలుగా ఉన్న పిల్లలను సందర్శించేందుకు వచ్చిన ట్రంప్ సతీమణి ఓ గ్రీన్ కలర్ జాకెట్ ధరించి వచ్చింది. ఇందులో వింతేమీ లేకపోయినప్పటికీ, ఆ జాకెట్ వెనుకవైపు రాసి ఉన్న అక్షరాలు మాత్రం వివాదాస్పదంగా మారాయి.

మెలానియా ట్రంప్ ధరించిన జాకెట్ వెనుక వైపు 'ఐ రియల్లీ డోన్ట్‌ కేర్‌, డూ యూ?' (నేను అస్సలు పట్టించుకోను, మరి మీరు) అని రాసి ఉంది. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. వలస శిభిరాల్లో తల్లిదండ్రులకు దూరంగా ఉన్న చిన్నారులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఇలాంటి రాతలున్న జాకెట్ ధరించడం ఏంటంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వివిధ సామాజిక మాధ్యమాలలో ఈ విషయం గురించి చర్చిస్తున్నారు.

అయితే, ఈ విషయంపై మెలానియా అధికార ప్రతినిధి స్టెఫానీ గ్రీషమ్ స్పందిస్తూ.. ఆ జాకెట్‌లో ఉన్న వ్యాఖ్యల్లో ఏలాంటి గూఢార్థమేమీ లేదని స్పష్టం చేశారు. ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఇదంతా నకిలీ అని, బూటకు వార్తల మీడియాను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

PREV
click me!

Recommended Stories

పాకిస్థాన్‌లో గూగుల్ పే ఉంటుందా.? అక్క‌డి ప్ర‌జ‌లు డిజిట్ పేమెంట్స్ చేస్తారా లేదా.?
Flying Taxi: గంట‌లో హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్లొచ్చు.. తొలి ఫ్ల‌యింగ్ టాక్సీ స్టేష‌న్ సిద్ధం