టర్కీలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్: 11 మంది మృతి

By narsimha lodeFirst Published Mar 5, 2021, 10:26 AM IST
Highlights

టర్కీకి చెందిన ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది.ఈ ఘటనలో 11 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గురువారం నాడు మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకోగా, శుక్రవారం నాడు వెలుగు చూసింది. 

అంకారా: టర్కీకి చెందిన ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది.ఈ ఘటనలో 11 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గురువారం నాడు మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకోగా, శుక్రవారం నాడు వెలుగు చూసింది. 

కుర్ధిష్ జనాభా కలిగిన బిట్లిస్ ప్రావిన్స్ లోని టాట్వాన్ పట్టణానికి దగ్గరగా ఉన్న సిక్మీస్ గ్రామం వద్ద కౌగర్ రకం హెలికాప్టర్ కుప్పకూలింది. బింగోల్ నుండి తత్వాన్ కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏటీసీతో సంబంధాలను కోల్పోయిందని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన ప్రాంతంలోనే 9 మంది మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. 

ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉస్మాన్ ఎర్బాస్ ఉన్నారు.ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తోంది రక్షణ శాఖ. సంఘటన స్థలాన్ని రక్షన మంత్రి హులుసి అకర్, హోంమంత్రి సులేమాన్, సీనియర్ సైనిక ప్రముఖులు బయలుదేరారు.

యూరోపియన్ యూనియన్, అమెరికా  దేశాలు నాటో మిత్ర దేశానికి సంతాపం తెలిపాయి. బిట్లీస్ లో 11 మంది సైనిక సిబ్బంది మరణించడంపై తాము తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నట్టుగా ఈయూ టర్కీ రాయబారి నికోలస్ మేయర్ ల్యాండ్ రూట్ చెప్పారు.

ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అమెరికా రాయబార కార్యాలయం ట్విట్టర్ లో కోరింది.

click me!