న్యూజిలాండ్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

By telugu news teamFirst Published Mar 5, 2021, 8:55 AM IST
Highlights

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సిందిగా అధికారులు అప్రమత్తం చేశారు. భూకంప నష్టంపై ఇంకా వివరాలు తెలియలేదు. 

న్యూజిలాండ్ లో భూకంపం సంభవించింది. ఫసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీపదేశం న్యూజిలాండ్ కు చెందిన నార్త్ ఐలాండ్ ని భూకంపం కుదేలు చేసింది. భూకంప తీవ్రత కూడా అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 7.2గా నామోదైందని అధికారులు చెప్పారు. భూకంప తీవ్రత రీత్యా న్యూజిలాండ్ తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సిందిగా అధికారులు అప్రమత్తం చేశారు. భూకంప నష్టంపై ఇంకా వివరాలు తెలియలేదు. నార్త్ ఐలాండ్ తూర్పు ప్రాంతంలో సునామీ కబళించే ప్రమాదం ఉన్నట్టు నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ (ఎన్ఈఎంఏ) భావిస్తోంది.

కాగా, భూకంప కేంద్రం గిస్బోర్న్ నగరానికి సమీపంలో ఉన్నట్టు గుర్తించారు. ఇక్కడికి సమీపంలోని కేప్ రనవే, టొలాగా బే ప్రాంతాల్లోని ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం వేకువజామున 3.34 గంటలకు సునామీ మొదటి అల విరుచుకుపడే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. సునామీ ప్రభావం కొన్ని గంటల పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే... ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని వారు పేర్కొన్నారు.  ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

click me!