ప్రధాని పదవికి పొంచివున్న గండం.. ఇమ్రాన్‌ సర్కార్‌కు విశ్వాస పరీక్ష..!!

By Siva KodatiFirst Published Mar 4, 2021, 5:46 PM IST
Highlights

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం వచ్చి పడింది. పార్లమెంట్‌లో శనివారం ఆయన విశ్వాస పరీక్ష ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్.. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో భేటీ అయ్యారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం వచ్చి పడింది. పార్లమెంట్‌లో శనివారం ఆయన విశ్వాస పరీక్ష ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్.. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో భేటీ అయ్యారు.

ఆ సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా పాల్గొన్నారు. అలాగే గురువారం సాయంత్రం 7.30 గంటలకు ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ ప్రకటించడం పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది.

ఇమ్రాన్ కేబి‌నెట్ లోని ఆర్థిక శాఖ మంత్రి సెనెట్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత యూసఫ్ రజా గిలానీ చేతిలో ఓటమి పాలవ్వడంతో పాకిస్తాన్ రాజకీయాలు మారిపోయాయి. దీంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ బలపరీక్షకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పాక్ దిగువ సభ జాతీయ అసెంబ్లలో బలపరీక్ష నెగ్గడం ద్వారా ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలన్నది ఇమ్రాన్ వ్యూహాంగా తెలుస్తోంది. శుక్రవారం నాడే ఆయన విశ్వాసపరీక్షకు వెళతారని తొలుత భావించినప్పటికీ శనివారం నాటికి వాయిదా పడింది.

అయితే.. నేటి ప్రసంగంలో ఇమ్రాన్ ఏ విషయంపై మాట్లాడతారనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనబోతున్నారనే విశ్లేషణలు ఊపందుకున్నాయి.

click me!