విషాదం: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తనయుడు జైన్ మృతి

Published : Mar 01, 2022, 11:55 AM ISTUpdated : Mar 01, 2022, 12:38 PM IST
విషాదం: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తనయుడు జైన్ మృతి

సారాంశం

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కొడుకు జైన్ నాదెళ్ల సోమవారం నాడు మరణించారు.  ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.   

వాషింగ్టన్: Microsoft సీఈఓ సత్య నాదెళ్ల తనయుడు Zain Nadella సోమవారం నాడు ఉదయం మరణించాడు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. జైన్ నాదెళ్ల వయస్సు 26 ఏళ్లు. జైన్ మరణించినట్టుగా  తన సిబ్బందికి పంపిన ఈ మెయిల్ లో తెలిపారు. జైన్ నాదెళ్ల కండరాల వ్యాధితో జన్మించాడు. జైన్ నాదెళ్లకు సంగీతంపై మక్కువ అని చిల్డ్రన్స్ ఆసుపత్రి సీఈఓ జెఫ్ స్పెరింగ్ చెప్పారు. 

మైక్రోసాఫ్ట్ ను నెంబర్ వన్ బ్రాండ్ గా తీర్చిదిద్దడంలో  Satya Nadella కీలకంగా నిలిచారు.  దీంతో ఈ ఏడాది జనవరిలో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ప్రపంచంలోని టాప్ సీఈఓల్లో టాప్ లో నిలిచారు. అమెరికాకు వలస వచ్చిన సత్య నాదెళ్ల కుటుంబం  మొదటి తరం Indiaకు చెందినవారు. 
మరో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన సీఈఓలు కూడా అగ్రస్థానంలో ఉన్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఐదవ స్థానంలో ఉండగా, అడోబ్ కు చెందిన శాంత నారాయణ్  6వ స్థానంలో నిలిచారు. డెలాయిట్ కు చెందిన పునీత్ రెంజెన్ 14వ స్థానంలో నిలిచారు.

సత్య నాదెళ్ల, అను  దంపతలు పెద్ద కొడుకు జైన్ నాదెళ్ల,. జైన్ నాదెళ్ల 1996లో జన్మించాడు. జైన్ పుట్టుకతోనే వీల్ చైర్ కే పరిమితమయ్యాడు.  సత్య నాదెళ్ల తన కొడుకు లాంటి వాళ్ల కోసం వినూత్న పరికరాలపై దృష్టి పెట్టారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే