మెక్సికో నూతన అధ్యక్షుడిగా ఆండ్రోస్ మాన్యువల్ లోపేజ్ ఒబ్రెడార్

First Published Jul 2, 2018, 4:15 PM IST
Highlights

53 శాతం ఓట్లతో ఘన విజయం...

లాటిన్ అమెరికా ప్రాంతంలోని మెక్సికో దేశంలో నూతన శకం ప్రారంభమైంది. అక్కడ ఇటీవల జరిగిన ఎన్నికల్లో లెప్ట్ పార్టీ నాయకుడు ఆండ్రోస్ మాన్యువల్ లోపేజ్ ఒబ్రెడార్ భారీ మెజారిటీ తో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లలో 53 శాతం ఓట్లను సాధించిన ఈయన అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయన ప్రస్తుతం మెక్సికో సిటీ మేయర్ గా ఉన్నారు.

ఈయన్ని దేశ ప్రజలు ఆమ్లోగా పిలుచుకుంటారు. లాటిన్ అమెరికాలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన మెక్సికో లో అవినీతి రహిత పాలనను అందిస్తానని ఆమ్లో ప్రకటించారు. దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ మాపియాను ఉక్కుపాదాలతో అణచివేసి పేద ప్రజల పక్షాన నిలిచి వారికోసం పాలన అంధిస్తానని అన్నారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి అందరికి న్యాయం జరిగేలా చూస్తానని ఆమ్లో హామీ ఇచ్చారు.

ఆమ్లోకు సమీప ప్రత్యర్థికంటే రెండింతల ఎక్కువ ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన నేషనల్ యాక్షన్ పార్టీ కి చెందిన అభ్యర్థి రికార్డో అనయాకు 22 శాతం ఓట్లు వచ్చాయి. మిగతా పార్టీలు అసలు ఊసులోనే లేకుండా పోయాయి. 

అగ్ర రాజ్యం అమెరికాతో స్నేహాన్ని కొనసాగిస్తానని నూతన అద్యక్షుడు ప్రకటించారు. మెక్సికో పై అమెరికా విధించిన ఆంక్షలపై తర్వరలోనే ఆ దేశ అద్యక్షుడు ట్రంప్ తో చర్చించనున్నట్లు ఆమ్లో వెల్లడించారు. అయితే ఆమ్లో ఘనవిజయంపై  ట్రంప్ స్పందిస్తూ ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 
 

 

click me!