నీరవ్‌పై ఇంటర్‌పోల్ గురి.. రెడ్‌కార్నర్ నోటీసు జారీ

First Published Jul 2, 2018, 10:55 AM IST
Highlights

నీరవ్‌పై ఇంటర్‌పోల్ గురి.. రెడ్‌కార్నర్ నోటీసు జారీ

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.14 వేల కోట్ల మేర ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని ఎలాగైనా భారత్‌కు రప్పించాలని దేశంలోని అత్యున్నత దర్యాప్తు  సంస్థలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ తన వద్ద ఉన్న పాస్‌పోర్ట్‌లతో వివిధ దేశాల్లో చక్కర్లు కొడుతూ.. దర్యాప్తు సంస్థలకే షాక్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలన్న సీబీఐ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ అందుకు అంగీకారం తెలుపుతూ.. రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది.

విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్న నిందితులను అరెస్ట్ చేసేందుకు.. అతడిని స్వదేశానికి రప్పించేందుకు ఈ రెడ్‌కార్నర్  నోటీసు ఉపయోగపడుతుంది. అటువంటి నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఇంటర్‌పోల్ తన సభ్యదేశాలను ఆదేశిస్తుంది. తద్వారా నిందితుడు ఏ ప్రదేశంలో ఉన్నాడనే సమాచారాన్ని ఇంటర్‌పోల్‌ భాగస్వామ్యదేశాలు పంచుకుంటాయి.

click me!