13 ఏళ్ల బాలుడితో 31 ఏళ్ల మహిళ శృంగారం, గర్భం దాల్చిన ఆమె ప్రసవం.. జైలు నుంచి విడుదల

Published : Mar 05, 2023, 01:56 PM IST
13 ఏళ్ల బాలుడితో 31 ఏళ్ల మహిళ శృంగారం, గర్భం దాల్చిన ఆమె ప్రసవం.. జైలు నుంచి విడుదల

సారాంశం

అమెరికాకు చెందిన 31 ఏళ్ల మహిళ 13 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం పెట్టుకుంది. శృంగారంలో పాల్గొనడంతో ఆమె గర్భం దాల్చింది. ఓ బాలుడికి జన్మనిచ్చింది. బాలుడితో శారీరకంగా సంబంధం పెట్టుకున్న ఆరోపణలతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కానీ, ఆమె ప్రసవం తర్వాత ప్రాసిక్యూటర్లతో పెట్టుకున్న డీల్‌తో జైలు నుంచి బయటకు వచ్చింది.  

న్యూఢిల్లీ: ఆమెకు 31 ఏళ్లు. ఆ బాలుడికి 13 సంవత్సరాలు. మైనర్ బాలుడితో ఆ మహిళ శారీరక సంబంధం పెట్టుకుంది. ఆ బాలుడితో శృంగారంలో పాల్గొంది. గర్భం దాల్చింది. అనంతరం, ప్రసవించింది. కానీ, ఆమె జైలు నుంచి బయటపడింది. దీనితో ఆ మైనర్ బాలుడి తల్లి అసంతృప్తికి గురవుతున్నది. తన కొడుకు జీవితాన్ని నాశనం చేసిందని మండిపడుతున్నది.

అమెరికాలోని కొలరాడోలో  ఫౌంటెయిన్ ఏరియాకు చెందిన 31 ఏళ్ల ఆండ్రియా సెర్రానో 13 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం పెట్టుకున్నట్టు అంగీకరించింది. 2022లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై లైంగిక దాడి అభియోగాలు మోపారు. ఇటీవలే ఆమె బాలుడికి జన్మనిచ్చింది. అనూహ్యంగా ఆమె న్యాయవాదులు ప్రాసిక్యూటర్ల‌తో ఓ ప్లీ డీల్ పెట్టుకున్నారు. ఆమె తనను తాను సెక్స్ అఫెండర్‌గా రిజిస్టర్ చేసుకుంది. దీంతో ఆమె శిక్ష తగ్గడమే కాదు.. ఇప్పుడు జైలు నుంచి బయటపడింది.

కొలరాడో రాష్ట్రంలో ఇది క్లాస్ ఫోర్ నేరంగా పరిగణిస్తారు. కానీ, తాజా ఒప్పందంతో ఆమె అభియోగాలు కొంత పలుచబడ్డాయి. అయినప్పటికీ ఆమెకు పదేళ్ల నుంచి జీవిత ఖైదు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు ఆమెకు ఇచ్చిన ప్రొబేషన్ కాలం ఎంత కాలం అనేది మే నెలలో తేలనుంది.

Also Read: మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత ప్రధానికి 8 విపక్ష పార్టీల లేఖ.. కాంగ్రెస్ ఎందుకు దూరంగా ఉన్నది?

తాజా డీల్‌తో తప్పనిసరి జైలు నుంచి ఆమె తప్పించుకోగలిగారు. ఇలా ఆమె బయటకు రావడాన్ని బాలుడి కుటుంబం జీర్ణించుకోవడం లేదు. సెర్రానో జన్మనిచ్చిన బేబీని తన కొడుకు కస్టడీకి అప్పగించాలని, ఆమెను జైలుకు పంపించాలని బాలుడి కుటుంబం కోర్టును అడగడానికి ప్రణాళికలు వేస్తున్నారు. తన కొడుకు (ఇప్పుడు 14 సంవత్సరాలు) బాల్యాన్ని ఆమె మొత్తంగా హరించివేసిందని, ఇప్పటి నుంచి తండ్రిగా వ్యవహరించాల్సి ఉంటుందని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు కచ్చితంగా శిక్ష పడాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !