ఇటలీలోని మిలాన్‌లో భారీ పేలుడు.. మంటల్లో వాహనాలు..

Published : May 11, 2023, 04:18 PM ISTUpdated : May 11, 2023, 04:28 PM IST
ఇటలీలోని మిలాన్‌లో భారీ పేలుడు.. మంటల్లో వాహనాలు..

సారాంశం

ఇటలీలోని మిలాన్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఇటలీలోని మిలన్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన అనంతరం పలు కార్లు మంటల్లో చిక్కకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ప్రాథమిక సమాచారం.. పార్క్‌ చేసిన వ్యాన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడ మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించింది.  పేలుడు సంభవించి తర్వాత అనేక వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయని..  ఒక వ్యక్తి గాయపడ్డారని అగ్నిమాపక దళం తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి మరణాలు సంభవించినట్టుగా ఇప్పటివరకు నివేదించబడలేదు. 

ఆక్సిజన్ గ్యాస్ డబ్బాలను రవాణా చేస్తున్న వ్యాన్‌లో పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నట్లు ఇటాలియన్ మీడియా తెలిపింది. కార్లలో పెద్ద ఎత్తున మంటల్లో చిక్కుకుపోవడంతో.. ఆ ప్రాంతంలో నల్లటి పొగ వ్యాపించింది. దీంతో సమీపంలోని ఒక ప్రాథమిక పాఠశాల, నివాస భవనం ఖాళీ చేయబడిందని  స్థానిక మీడియా పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ