Maharashtra Political Crisis| ‘మహా’ రాజకీయ సంక్షోభంపై రేపు 'సుప్రీం' కీలక తీర్పు..  

By Rajesh KarampooriFirst Published May 10, 2023, 11:31 PM IST
Highlights

Maharashtra Political Crisis:  మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం కీలక తీర్పును వెలువరించే అవకాశముంది. రెండు కేసులకు సంబంధించి గురువారం తీర్పును వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. 

Maharashtra Political Crisis: గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ పోరుకు త్వరలో తెరపడనుంది. శివసేనకు చెందిన 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు గురువారం (మే 11) తీర్పు వెలువరించనుంది. గత ఏడాది జూన్ 2022లో ఏక్‌నాథ్ షిండే, అతని వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు శివసేనపై తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వం పడిపోయింది.

తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్‌ ఠాక్రే బృందం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌కు పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఏకనాథ్ షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి స్టే విధించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలపై అవిశ్వాస తీర్మానం పెట్టారని, అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకోలేమని ఏక్‌నాథ్ షిండే వర్గం అంటోంది. దాదాపు 9 నెలల పాటు సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది.

ఠాక్రే వర్గం వాదన ఏమిటి?

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ఉటంకిస్తూ.. ఎమ్మెల్యేల బృందం మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ తిరుగుబాటు చేస్తే, వారు ఏదో ఒక పార్టీలో విలీనం చేయాల్సి ఉంటుందని థాకరే వర్గానికి చెందిన న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించారు. కానీ షిండే , అతని బృందం అలా చేయలేదు. అందువల్ల వారిని అనర్హులుగా ప్రకటించాలి. అదే సమయంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాసంపై లేవనెత్తిన ప్రశ్నను కూడా ఠాక్రే వర్గం తప్పుబట్టింది.

షిండే వర్గం వాదన ఏమిటీ? 

తమ ఎమ్మెల్యేలు పార్టీలో తిరుగుబాటు చేయలేదని, వారు ఇప్పటికీ శివసేనలోనే ఉన్నారని, ఇంతకుముందు కూడా శివసేనలోనే ఉన్నారని సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా షిండే వర్గం న్యాయవాదులు తెలిపారు. కాబట్టి రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను ఉటంకిస్తూ దాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేయడం నిరాధారమనీ, శివసేన పార్టీ అసెంబ్లీలో గ్రూప్ లీడర్‌గా ఏక్‌నాథ్ షిండే ఉన్నారు. తమకు మెజారిటీ ఉన్నందున ఎమ్మెల్యేల కోరం పూర్తికాకుండానే వారిని అక్రమంగా తొలగించేందుకు ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నించారు.
 
16 మంది ఎమ్మెల్యేలను అనర్హ వేటు
 
పిటిషన్‌లో ఏక్‌నాథ్ షిండే, భరత్‌షేత్ గోగావాలే, సందీపన్‌రావ్ బుమ్రే, అబ్దుల్ సత్తార్, సంజయ్ శిర్సత్, యామినీ జాదవ్, అనిల్ బాబర్, బాలాజీ కినికర్, తానాజీ సావంత్, ప్రకాష్ సర్వే, మహేశ్ షిండే, లతా సోనావానే, చిమన్‌రావ్ పాటిల్, రమేష్ బోర్నారే, బాలాజీ రాయ్ముల్కర్ కళ్యాణ్‌కర్‌పై అనర్హత వేటు వేయాలన్న డిమాండ్‌ వచ్చింది.
 

click me!