అమెరికా హిస్టరీలో 50 ఏళ్లపాటు మిస్టరీగా మిగిలిపోయిన ఓ దొంగతనం కేసు ఉన్నది. బిజినెస్‌మన్‌లా హుందాగా ఫ్లైట్ ఎక్కి బాంబు ఉన్నదని బెదిరించి సొమ్ము వసూలు చేసుకుని ఆకాశంలోనే విమానం నుంచి దూకేసిన ఆ దొంగ ఆచూకీని కొన్ని ఏళ్లపాటు ఎఫ్‌బీఐ దర్యాప్తు చేసినా కనిపెట్టలేకపోయింది. కాగా, ఆయన రియల్ లైఫ్ జేమ్స్ బాండ్ అంటూ అమెరికన్లలో ఓ పేరు వచ్చింది. ఆయన పేరు, ఊహా చిత్రాలతో టీషర్టులు, టీ కప్‌లు, ఇతర సరుకులు విరివిగా అమ్ముడుపోయాయి.
వాషింగ్టన్: మంచి బిజినెస్ సూట్ ధరించి ఉన్నాడు. క్లాస్‌గా లుక్ ఇస్తూ ఎయిర్‌పోర్టు కౌంటర్‌లో ఫ్లైట్ టికెట్ తీసుకున్నాడు. అంతే హుందాగా ప్లేన్ ఎక్కి కూర్చున్నాడు. ఎయిర్ హోస్టెస్‌కు సింపుల్‌గా ఓ కాగితం ముక్క చేతికి ఇచ్చాడు. ఆమె మరో పనిలో మునిగి ఆ కాగితం ముక్కపై అంతగా శ్రద్ధ వహించలేదు. ఆమెను దగ్గరకు పిలిచి కాస్త ఆమె వైపు వంగి తన సూట్ కేసులో బాంబ్ ఉన్నదని నింపాదిగా చెప్పాడు. Bomb మాట వినగానే ఎయిర్ హోస్టెస్ హడలిపోయింది. ఆ విమానాన్ని హైజాక్(Flight Hijack) చేసి అప్పట్లోనే రెండు లక్షల డాలర్లు(ఇప్పుడు వాటి విలువ సుమారు 13 లక్షల డాలర్లు) బ్యాగ్‌లో సర్దుకున్నాడు. అందరు చూస్తుండగానే విమానం వెనుక డోర్ ఓపెన్ చేసి బయట అడుగు పెట్టాడు. అంతే మరెవరకీ ఆయన చిక్కలేదు.
ఈ ఘటన జరిగిన 50 ఏళ్లు గడిచినా ఆయన ఆచూకీ లభించలేదు. ఆయన ఫ్లైట్ నుంచి దూకేసిన ప్రాంతంగా భావిస్తున్న చోట్ల విస్తృత తనిఖీలు చేశారు. కనీసం ప్యారాచూట్ ఆనవాళ్లూ కనిపించలేవు. ఏ ఆధారాలు దొరకలేవు. ఎఫ్‌బీఐ ఈ కేసుపై దశాబ్దాలుగా దర్యాప్తు చేసి 2016లో కేసు మూసేసింది. సేమ్ జేమ్స్ బాండ్(James Bond) తరహాలో ఆయన ఈ సాహస కృత్యం అదే.. దొంగతనం చేశాడని కొందరిలో కొంత పాజిటివ్ పాయింట్ కూడా వచ్చింది. కొందరైతే ఆయనపట్ల అభిమానాలను బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఆయన పేరు.. ఊహా చిత్రాలతో టీ షర్టులు, కాఫీ కప్‌లు.. ఒకటేమిటో.. ఆయన దొంగే అయినా, ఒక హీరో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. కానీ, ఇప్పటికీ ఆయన ఎవరో అనేది రహస్యంగా ఉండిపోయింది.
undefined
Also Read: బ్యాంక్ క్యాషియర్‌కు హ్యాండ్ రైటింగ్ అర్థం కాలేదు.. దొంగకు పరాభవం
అది 1971వ సంవత్సరం. సుమారు నాలుగు పదుల వయసు ఉండి ఉండవచ్చు. బిజినెస్ సూట్ ధరించి ఉన్నాడు. వైట్ షర్ట్.. బ్లాక్ టైతో అదిరిపోయే రేంజ్‌లో ఉన్నాడు. తన పేరును డాన్ కూపర్‌గా పరిచయం చేసకుంటూ పోర్ట్‌లాండ్ ఎయిర్‌పోర్టు కౌంటర్‌లో సియాటెల్‌కు ఫ్లైట్ టికెట్ తీసుకున్నాడు. అనంతరం ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఓ నోట్ ఎయిర్‌హెస్టెస్‌కు ఇచ్చిన తన సూట్ కేసులో బాంబు ఉన్నదని బెదిరించాడు. ఆ సూట్‌కేసులో అన్ని వైర్లు చిందర వందరగా ఉన్నాయి. అది చూసి ఎయిర్‌హోస్టెస్ భయపడింది. తన డిమాండ్లు అన్ని ఆ కాగితంపై రాసిచ్చాడు. వివరాలు ఫ్లైట్ కెప్టెన్‌కు ఆమె చేరవేసింది. నాలుగు ప్యారాచూట్లు, రెండు లక్షల డాలర్లు కావాలని డిమాండ్ చేశాడు.
విమానం సియాటెల్‌లో ల్యాండ్ అయింది. 36 మంది ప్రయాణికులకు బదులుగా ప్యారాచూట్లు, డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. ప్రయాణికులు కిందికి దిగారు.. ఎఫ్‌బీఐ అధికారులు ఆయనకు కావాల్సినవి తెచ్చి ఇచ్చారు. కానీ, విమాన సిబ్బందిని లోపలే ఉండాలని అన్నాడు. మళ్లీ ఇప్పుడు విమానం మెక్సికో సిటీకి తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించాడు. కానీ, తక్కువ ఎత్తులో వెళ్లాలని ఆదేశించాడు. అది బోయింగ్ 727 విమానం. విమానం మళ్లీ టేకాఫ్ అయింది. రెనో, నెవాడా మీదుగా విమానం వెళ్లుతుండగా విమానం వెనుక డోర్ ఓపెన్ చేశాడు. అంతా చీకటి.. మంచు దుప్పటి ఉన్నది. కానీ, ఆయన వెనుకడుగు వేయలేదు. ప్యారాచూట్లతో కిందకు దూకేశాడు. అందరు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తుండిపోయారు.
Also Read: కథ అడ్డం తిరిగింది.. డిప్యూటీ కలెక్టర్ ఇంట్లోకి దోపిడీకి వెళ్లి.. షాకింగ్ లేఖ రాసి వచ్చిన దొంగ
ఆ తర్వాత ఆ కూపర్ జాడ ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. కొన్ని వారాలపాటు వాయవ్య అమెరికాలోని ఆ దట్టమైన అడవుల్లో గాలింపులు జరిపారు. కూపర్ బతికే ఉన్నాడా? అంత పై నుంచి దూకేసినా ప్రాణాలు నిలుపుకోగలిగాడా? కింద పడితే ఆయన షర్టు, బట్టలు, ప్యారాచూట్, సూట్ కేసు, ఇతర వస్తువులు.. లేదా చెట్లు, భూమిపైనా ఆయన దూకినప్పటి మరకల ఆనవాళ్లూ కనిపించలేవు. ఐదేళ్లపాటు సుమారు 800 మంది అనుమానితులను ఎఫ్‌బీఐ దర్యాప్తు చేసింది. కానీ, ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోయింది.