ఫోన్ మింగేసి ఏం కాదనుకున్నాడు.. ఆరు నెలల తర్వాత బాధ భరించలేక డాకర్ల వద్దకు వెళితే..

By team teluguFirst Published Oct 21, 2021, 12:09 PM IST
Highlights

 ఓ  వ్యక్తి  ఆరు నెలల క్రితం ఫోన్‌ను (Man swallows phone) మింగేశాడు. అది జీర్ణమై మలం ద్వారా  బయటకు వస్తుందని  భ్రమ పడ్డాడు. అలా జరిగి ఉంటుందని  భావించి.. డాక్టర్లను  సంప్రందించలేదు.  అయితే  కడుపులోనే ఉండిపోయిన  ఫోన్... కొన్ని  రోజుల తర్వాత అతడిని  ఇబ్బందులకు గురిచేసింది. 

ఓ వ్యక్తి  కడుపు  నొప్పితో ఆస్పత్రిలో  చేరాడు. అయితే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు.  ఎందుకంటే  అతని  కడుపులో మొబైల్ ఫోన్ ఉండటమే  కారణం. ఆరు నెలలుగా  మొబైల్ ఫోన్ అతని కడుపులోనే ఉన్నట్టుగా  తేలింది. ఈ ఘటన దక్షిణ  ఈజిప్ట్‌లో (Egypt) చోటుచేసుకుంది. ఈజిప్టుకు చెందిన  ఓ  వ్యక్తి  ఆరు నెలల క్రితం ఫోన్‌ను (Man swallows phone) మింగేశాడు. అది జీర్ణమై మలం ద్వారా  బయటకు వస్తుందని  భ్రమ పడ్డాడు. అలా జరిగి ఉంటుందని  భావించి.. డాక్టర్లను  సంప్రందించలేదు.  అయితే  కడుపులోనే ఉండిపోయిన  ఫోన్... కొన్ని  రోజుల తర్వాత అతడిని  ఇబ్బందులకు గురిచేసింది. తొలుత  ఆహారం  తీసుకోవడానికి  ఎలాంటి  ఇబ్బంది లేకపోయినప్పటికీ.. తర్వాత ఆహారం  తీసుకోవడానికి చాలా ఇబ్బంది  పడాల్సి  వచ్చింది.

కడుపులో ఉన్న ఫోన్.. ఆహారం లోనికి వెళ్లకుండా నిరోధించింది. దీంతో అతడు  కొద్దికాలంగా చాలా తక్కువ ఆహారం  తీసుకుంటూ జీవనం  సాగించాడు. అయితే ఇటీవల అతనికి కడుపు నొప్పి భరించలేనంత  తీవ్రంగా మారింది. దీంతో ఏం చేయలేని స్థితిలో వైద్యుల వద్దకు వెళ్లాడు. అక్కడ డాక్టర్లు అతనికి పరీక్షలు నిర్వహించారు.  అతనికి తీసిన  ఎక్స్ రేలో ఫోన్ కనిపించడంతో  వారు ఆశ్చర్యపోయారు. దీంతో  అతనికి అత్యవసర  శస్త్రచికిత్స  నిర్వహించారు. వెంటనే ఫోన్‌ను కడుపులో  నుంచి తొలగించారు. ఈజిప్టులోని అస్వాన్ నగరంలోని అస్వాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది.


ఫోన్ 6 నెలలుగా కడుపు లోపలే ఉండిపోవడంతో.. పేగుల్లో గాయాలు  అయినట్టుగా, ఇన్ఫెక్షన్  సోకినట్టుగా వైద్యులు తెలిపారు. దీంతో అతనికి అత్యవసర చికిత్స  చేయాల్సి వచ్చిందని  చెప్పారు. అయితే ప్రస్తుతం అతడి  ఆరోగ్యం నిలకడగానే  ఉందని.. త్వరలోనే కోలుకుంటాడని  వైద్యులు  తెలిపారు. 

Also Read: ఇమ్రాన్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు.. వాటిని అమ్ముకుంటున్నాడని మండిపడ్డ ప్రతిపక్ష నేతలు

ఒక వ్యక్తి మొత్తం మొబైల్ ఫోన్‌ను మింగిన కేసును తాము చూడటం ఇదే మొదటిసారి అని అస్వాన్ యూనివర్సిటీ హాస్పిటల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరు తెలిపారు. అయితే  అతడు మొబైల్ ఎందుకు  మింగాడనే  విషయంలో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. 

click me!