వార్నీ.. కండోమ్ లో అరటిపండు కుక్కి మింగేశాడు.. ఆ తరువాత...

By SumaBala BukkaFirst Published Jan 30, 2023, 1:31 PM IST
Highlights

ఓ వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా.. అతని కడుపులో కనిపించింది చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. హార్మోన్ల మార్పుల కారణంగా అతను చేసిన పని అని డాక్టర్లు తెలిపారు. 

అమెరికా : యూఎస్ లో ఓ వ్యక్తి కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అతని కడుపును స్కానింగ్ చేసిన డాక్టర్లు ఆ రిపోర్టులో కనిపించింది చూసి షాక్ అయ్యారు. ఇంతకీ అతని కడుపులో ఉన్నది ఏంటంటే.. ఓ కండోమ్.. అందులో అరటిపండు...ఆశ్చర్యంగా ఉంది కదా.. 

అరటిపండును కండోమ్ లో దూర్చి మింగేశాడు ఆ వ్యక్తి. అదే అతని కడుపునొప్పికి కారణమయ్యింది. దీంతో డాక్టర్లు వెంటనే అతనికి ఆపరేషన్ చేసి కడపులోనుంచి అరటిపండు ఉన్న కండోమ్ ను తీసేశారు. ఆ తరువాత మూడు రోజులపాటు అబ్జర్వేషన్ లో ఉంచి.. డిశ్చార్జ్ చేశారు. అతనికి ఇంకా తినడంలో, మోషన్ పోవడంలో కాస్త ఇబ్బందిగానే ఉందని.. మెల్లిగా అది క్యూర్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. 

ఉక్రెయిన్ యుద్ధానికి ముందే బ్రిటన్ పై క్షిపణి దాడి చేస్తానని పుతిన్ బెదిరించాడు - బోరిస్ జాన్సన్

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. యునైటెడ్ స్టేట్స్‌లోని 34 ఏళ్ల ఓ వ్యక్తి ఆవేశంతో కండోమ్‌లో చుట్టిన అరటిపండు మింగేశాడు. ఈ రకమైన కేసు ప్రపంచంలోనే మొట్టమొదటిగా వైద్యులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఈ వారం క్యూరియస్ జర్నల్‌లో ప్రచురించబడింది.

"కండోమ్ సంబంధిత పేగు అడ్డంకుల మీద ప్రచురించిన పేపర్ లో చాలావరకు కండోమ్ లను డ్రగ్స్‌తో నింపి మింగేయడం..లాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని నివేదికలు ద్రవంతో నిండిన కండోమ్‌లు కూడా ఉన్న కేసుల గురించి ప్రస్తావించాయి. కానీ ప్రస్తుత కేసు ప్రపంచంలోనే మొదటి కేసుగా చెబుతున్నారు. అరటిపండు ఉన్న కండోమ్ ను మింగడం ఆశ్చర్యం, షాకింగ్ విషయం’ అని అధ్యయనం రచయితలు రాశారు.

పేరు తెలియని వ్యక్తి కడుపు నొప్పి, వికారం, వాంతులతో బాధపడుతూ స్థానిక ఆస్పత్రి అత్యవసర విభాగానికి వచ్చాడు. తాను ఏమీ తినలేక, తాగలేక చాలా బాధ పడుతున్నానని, ముందు రోజు నుంచి మోషన్ కి కూడా వెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే వైద్యులు సిటీ స్కాన్ చేసినప్పుడు, ఆ వ్యక్తి చిన్న ప్రేగులలో కండోమ్ చుట్టిన అరటిపండు అడ్డుగా ఉందని కనుగొన్నారు. 

దానిమీద అతడిని ప్రశ్నించగా.. హర్మోనల్ చేంజెస్ లో భాగంగా తాను 24 గంటల ముందు కండోమ్ చుట్టిన అరటిపండును మింగినట్లు  అంగీకరించినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ 34 ఏళ్ల వ్యక్తికి "డిప్రెషన్ చరిత్ర" ఉందని వైద్యులు గుర్తించారు, అయితే అతను తనకు తాను హాని చేసుకోవడానికి ఇలా చేయలేదని తెలుస్తోంది. తాను ఆ సమయంలో డ్రగ్స్ తీసుకోలేదని, తాను తాగలేదని కూడా చెప్పాడు. అదృష్టవశాత్తూ, సర్జన్లు అతని చిన్న ప్రేగు నుండి అరటిపండుతో నిండిన కండోమ్‌ను తొలగించగలిగారు. తీసివేసిన మూడు రోజుల తర్వాత అతను డిశ్చార్జ్ అయ్యాడు, 

click me!