నిజంగా చంపాలనుకోలేదు.. కల కంటూ.. అలా చేశాను...!

By AN TeluguFirst Published Jan 20, 2021, 1:39 PM IST
Highlights

ఓ తాగుబోతు ప్రియుడు ప్రియురాలిపై హత్యాయత్నం చేశాడు. అయితే తాను కావాలని చంపాలని చూడలేదని కల కంటూ అలా చేశానంటూ చెప్పుకొచ్చాడు. 2019లో ఇంగ్లాండ్ లో జరిగిన ఈ కేసులో డెర్బీ క్రౌన్‌ కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. 

ఓ తాగుబోతు ప్రియుడు ప్రియురాలిపై హత్యాయత్నం చేశాడు. అయితే తాను కావాలని చంపాలని చూడలేదని కల కంటూ అలా చేశానంటూ చెప్పుకొచ్చాడు. 2019లో ఇంగ్లాండ్ లో జరిగిన ఈ కేసులో డెర్బీ క్రౌన్‌ కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. 

 ప్రియురాలు జాక్సన్‌పై తాను ఉద్ధేశ్యపూర్వకంగా హత్యా ప్రయత్నం చేయలేదని, కలకంటూ ఆమె గొంతునులిమానని డెర్బీకి చెందిన 31 ఏళ్ల నిందితుడు బ్రాడ్లే సౌతో కోర్టుకు విన్నవించాడు. 

నిందితుడు మాట్లాడుతూ.. ‘‘ నేను అప్పుడు కలకంటున్నాను. ఫైటింగ్‌ రింగులో ఉండి ఓ వ్యక్తితో తలపడుతున్నాను. ఆ వ్యక్తి గొంతు నులుముతున్నాను. ఆ వెంటనే నేను కలలోంచి బయటపడి జాక్సన్‌ శ్వాస తీసుకోవటం కోసం ఇబ్బంది పడటం గుర్తించాను. అప్పుడర్థమయింది.. నేను కలలో గొంతు నులిమింది జాక్సన్ దని.. వెంటనే దేవుడా! ఆమెకు ఏమీ కాకూడదు అనుకున్నా.. ఆ వెంటనే బెడ్‌ మీదనుంచి పైకి లేచి గదిలోని లైటు వేశాను.

అంతే! నా గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. జాక్సన్‌ కదలిక లేకుండా పడి ఉంది. మా అమ్మకు ఫోన్‌ చేసి విషయం చెప్పాను. అంబులెన్స్‌కు ఫోన్‌ చేయమని ఆమె నాకు చెప్పింది. చేశాను. అంబులెన్స్‌ వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆ తరువాత జాక్సన్‌ క్షేమంగా బయటపడింది’’ అని తెలిపాడు. 

ఈ ఘటన మీద బాధితురాలు జాక్సన్‌ మాట్లాడుతూ.. ‘‘ అతడు నా గొంతు చుట్టూ తన చేతిని చాలా బలంగా బిగించాడు. దాంతో ఊపిరి పీల్చుకోవటనానికి ఇబ్బందిపడ్డాను. చచ్చిపోతానేమోనని భయపడ్డాను. పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళతానేమోనని బాధేసింది. అతడు నన్ను చంపటానికి ప్రయత్నించటం నమ్మలేకపోయాను’’ అని చెప్పుకొచ్చింది.

అయితే నిందితుడు, బాధితురాలు ఇద్దరి వాదనలను విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. 

click me!