కొద్ది గంటల్లో ప్రమాణస్వీకారం.. కమలా హ్యారిస్ ఆసక్తికర ట్వీట్

Published : Jan 20, 2021, 12:11 PM IST
కొద్ది గంటల్లో ప్రమాణస్వీకారం.. కమలా హ్యారిస్ ఆసక్తికర ట్వీట్

సారాంశం

అమెరికన్లు సమైక్యతతో ఉండాలనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను ఆమె ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అమెరికా అధ్యక్షుడిగా మరికొద్ది గంటల్లో జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు.. ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ కూడా ప్రమాణస్వీకారం  చేయనుున్నారు. కాగా.. ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు కమలా హ్యారిస్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

తన భర్త,  అమెరికా సెకండ్ జెంటిల్మన్ డగ్ ఎమ్హాఫ్‌తో పాటు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ దంపతులతో కలిసి కేపిటల్ వాషింగ్టన్ మాన్యుమెంట్ వద్ద దిగిన ఫొటోను కమల ట్వీట్ చేశారు. అమెరికన్లు సమైక్యతతో ఉండాలనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను ఆమె ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

కాగా, అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా బుధవారం కమలా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సోటోమేయర్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీంతో ఈ పదవి చేపడుతున్న తొలి మహిళగా, భారతీయ సంతతికి చెందిన తొలి వ్యక్తిగా, ఆఫ్రికన్‌- ఏషియన్‌ మూలాలున్న వ్యక్తిగా ఆమె చరిత్రకెక్కబోతున్నారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !