వీర్యం నింపిన సిరంజితో మహిళపై దాడి.. చివరకు..!

Published : Sep 10, 2021, 08:26 AM ISTUpdated : Sep 10, 2021, 08:58 AM IST
వీర్యం నింపిన సిరంజితో మహిళపై దాడి.. చివరకు..!

సారాంశం

 ఈ ఘటన 2020 ఫిబ్రవరిలో జరిగింది. తొలుత మహిళ తనకు ఏదో కుట్టిందని మహిళ భావించింది. ఆ తర్వాత ఆమెకు విషయం అర్థమైంది.


ఓ వ్యక్తి  వీర్యం నింపిన సిరంజితో మహిళపై దాడి చేశాడు. బలవంతంగా ఓ మహిళకు సిరంజి ద్వారా ఎక్కించాడు. ఈ సంఘటన అమెరికాలోని మెరీల్యాండ్ లో చోటుచేసుకోగా..  నిందితుడికి.. పదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

ఒహాయోకు చెందిన థామస్ స్టీమెన్(52)కు తొలుత 25ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత.. ఆ శిక్షను పదేళ్లకు కుదించింది. కిరాణ దుకాణంలోకి వచ్చిన మహిళకు స్టీమెన్ వెనక నుంచి సిరంజీని గుచ్చాడు. ఈ ఘటన 2020 ఫిబ్రవరిలో జరిగింది. తొలుత మహిళ తనకు ఏదో కుట్టిందని మహిళ భావించింది. ఆ తర్వాత ఆమెకు విషయం అర్థమైంది.

విచారణలో.. అతను సిరంజీలో వీర్యం కూడా కలిపాడని కూడా తేలింది. థామస్ స్టీమెన్ మరో ఇద్దరు బాధితులపై కూడా సిరంజితో దాడికి యత్నించడం గమనార్హం. తన ముందు నడవమని సూచిస్తూ 17ఏళ్ల యువతిపై వీర్యం చల్లాడు. బాధితుల ఫిర్యాదుతో  పోలీసులు స్టీమెన్ ఇంటిని తనిఖీ చేయగా.. ద్రవంతో కూడిన ఓ సిరంజిని గుర్తించారు.  అతని వద్ద 9 ఖాళీ సింరిజీనుల గుర్తించామని.. వాటిని సైతం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !