గన్‌తో ఓనర్‌ను కాల్చి చంపిన పెంపుడు కుక్క.. అమెరికాలో ఘటన.. ఎలా జరిగిందంటే?

By Mahesh KFirst Published Jan 25, 2023, 12:43 PM IST
Highlights

అమెరికాలో ఓ పెట్ డాగ్ ఓనర్‌ను షూట్ చేసి చంపేసింది. హంటింగ్ ట్రిప్‌ కోసం పికప్ ట్రక్కులో బయల్దేరుతుండగా.. ముందు సీటులో కూర్చున్న ఓనర్ బాడీలోకి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. వెనుక సీటులో గన్, పెట్ డాగ్‌ను అతను ఉంచాడు. ఆ గన్ పై డాగ్ దూకి ఉంటుందని, ఫలితంగా గన్ బుల్లెట్‌ను డిశ్చార్జ్ చేసి ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
 

న్యూఢిల్లీ: కొందరు పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటితో గాఢమైన సంబంధాన్ని ఏర్పరుచుకుంటారు. కాలక్షేపానికి, ఒంటరితనాన్ని పోగొట్టడానికి.. ఇలా ఎవరి అవసరాలు వారివి. జంతువులను పెంచుకుంటూ ఇంట్లో మనిషిలా చూసుకుంటారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి అలాగే.. తన పెంపుడు కుక్కను ట్రక్కులో బయటకు తీసుకెళ్లడానికి సిద్ధం అయ్యాడు. అది హంటింగ్ ట్రిప్. ట్రక్కు వెనుక సీటులో గన్, పెట్ డాగ్‌ను ఉంచి తాను ముందటి సీటులో కూర్చున్నాడు. ఇంతలోనూ ఎవరూ ఊహించని రీతిలో కుక్క ఆ గన్‌లో నుంచి బుల్లెట్‌ను డిశ్చార్జ్ చేసింది. ఆ బుల్లెట్ తమ ముందు సీట్లో కూర్చున్న ఓనర్ వీపులోకి చొచ్చుకెళ్లిందని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. స్పాట్‌లోనే అతను మరణించాడు. ఓ హంటింగ్ యాక్సిడెంట్‌లో పెట్ డాగ్ తుపాకీతో కాల్చగా వ్యక్తి మరణించాడని కన్సాస్ అధికారులు తెలిపారు.

పీపుల్ అనే వార్తా సంస్థ వివరాల ప్రకారం, కన్సాస్ రాష్ట్రంలో విచితాకు చెందిన 30 ఏళ్ల జోసెఫ్ ఆస్టిన్ స్మిత్ శనివారం ఉదయం తన పెంపుడు కుక్కతో హంటింగ్ ట్రిప్‌కు వెళ్లాడు. ఆ పెట్ డాగ్‌ను, గన్‌ను పికప్ ట్రక్కులో వెనుక సీట్లలో ఉంచాడు. తాను ముందు సీటులో కూర్చున్నాడు. ఆ కుక్క యాక్సిడెంటల్‌గా గన్ పై దూకుంది. ఆ గన్ ట్రిగ్గర్ నొక్కినట్టయింది. ఫలితంగా గన్‌లో నుంచి బుల్లెట్ దూసుకెళ్లి.. ముందు సీటులో ఉన్న స్మిత్‌ బాడీలోకి చీల్చుకెళ్లింది. సుమ్నర్ కౌంటీ షెరీఫ్ ఆఫీసు విడుదల చేసిన ప్రకటనలు పేర్కొంటూ పీపుల్ రిపోర్ట్ చేసింది.

Also Read: Texas School Shooting : తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాలి.. జో బిడెన్ పిలుపు..

గువేడా స్ప్రింగ్స్‌ గుండా వెళ్లే రివర్ రోడ్, 80వ స్ట్రీట్ సౌత్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. 

911 కాల్ రాగానే రెస్పాండింగ్ యూనిట్స్ వెంటనే స్పాట్‌కు చేరారని షెరిఫ్ ఆఫీస్ పేర్కొంది. కానీ, బాధితుడు బుల్లెట్ గాయాలతో స్పాట్‌లోనే మరణించాడని ఎస్‌సీఎస్‌వో పేర్కొంది.

అమెరికాలో ఇలా అనుకోకుండా కాల్పులు జరిగే ఘటనలు సర్వసాధారణం అవుతున్నాయి. ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి ఇలాంటివి 101 ఘటనలు జరిగినట్టు గన్ వాయిలెన్స్ ఆర్కైవ్ పేర్కొంది. 2022లో 1,600ల అన్‌ఇంటెన్షనల్ షూటింగ్స్ జరిగాయని వివరించింది. కాగా, 2023లో అమెరికాలో ఇక్కడ 2,400 మంది తుపాకీ కాల్పుల్లో మరణించారు. అమెరికాలో జనాభా కంటే తుపాకుల సంఖ్య ఎక్కువ. అందుకే అక్కడ గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆయుధాల మీద ఆధారపడ్డదేనని కొందరి ఆరోపణలు కొత్తేమీ కాదు.

click me!