అమెరికాలో దారుణం.. భార్య విడాకులు అడిగిందని.. ఏడుగురు కుటుంబసభ్యులను చంపి.. తాను కాల్చుకున్న వ్యక్తి...

By SumaBala BukkaFirst Published Jan 6, 2023, 8:22 AM IST
Highlights

మృతుల్లో అతని భార్య, ఆమె తల్లి, దంపతుల ఐదుగురు పిల్లలు ఉన్నారు. పిల్లల్లో ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వీరంతా  నాలుగు నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు వారే.

లాస్ ఏంజిల్స్ : ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురితో కూడిన తన కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపాడో వ్యక్తి. ఈ ఘటన అమెరికాలో కలకలం రేపింది. తన భార్య విడాకుల కోసం దాఖలు చేయడంతోనే ఈ దారుణానికి తెగించాడని, కుటుంబంలోని ఏడుగురి మీద తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడని అమెరికా అధికారులు గురువారం తెలిపారు.

కుటుంబానికి సన్నిహితులు, బంధువులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎనోచ్ సిటీలోని చిన్నదైన ఉటా సెటిల్‌మెంట్‌లో పోలీసులు ఈ మేరకు ఎనిమిది మృతదేహాలను కనుగొన్నారు. వాటిలో ఒకటి నాలుగేళ్ల వయస్సు చిన్నారి కూడా ఉండడం అందర్నీ కలిచివేస్తోంది. దీనిమీద పోలీసులు మాట్లాడుతూ.. బుధవారం ఒక ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పెద్దలు, ఐదుగురు పిల్లల మృతదేహాలను కనుగొన్నామని తెలిపారు. వీరంతా తుపాకీ గాయాలతో మరణించారని తెలిపారు.

చైనాలో కరోనా కలకలం.. దేశ జనాభాలో 40% మందికి పాజివిట్!

"ఇంట్లో ఉన్న ఏడుగురిని చంపిన తర్వాత అనుమానితుడు తన ప్రాణాలను తీసుకున్నాడని లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది’ అని నగరం నుండి వెలువడిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిందితుడిని 42 ఏళ్ల మైఖేల్ హైట్ అని గుర్తించారు.

మృతులు అతని భార్య, ఆమె తల్లి, దంపతుల ఐదుగురు  పిల్లలు.. వీరిలో-- ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వీరంతా నాలుగు నుంచి 17 సంవత్సరాల లోపువారే కావడం గమనార్హం. ఎనోచ్ మేయర్ జియోఫ్రీ చెస్నట్ మాట్లాడుతూ, వీరి వైవాహిక జీవితం విచ్ఛిన్నం తర్వాతే ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు.

"కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం, డిసెంబర్ 21వ తేదీన కోర్టులో అతని భార్య  విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది" అని ఆయన విలేకరులతో అన్నారు. చెస్నట్ ఎనోచ్ చిన్న ఊరు. అందరూ ఒకరికొకరు బాగా తెలుసు. పక్కింటి వ్యక్తి మాట్లాడుతూ.. నిందితుడు మా పొరిగింట్లో ఉంటారు. వారి పిల్లలు మా పిల్లలతో కలిసి ఆడుకుంటారని తెలిపారు. 

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం.. భయంతో పరుగులు దీసిన జనం..

ఒకేసారి ఎనిమిదిమంది హత్యలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ కేసులో నేరానికి సంబంధించి ఇంకెవరి కోసం వెతకడం లేదని పోలీసులు తెలిపారు. చీఫ్ జాక్సన్ ఎయిమ్స్ అధికారులు బాధిత కుటుంబానికి తెలిసివారేనని చెప్పారు. ఆయన మాట్లాడుతూ " కొన్ని సంవత్సరాల క్రితం ఈ కుటుంబంతో కొన్ని పరిశోధనలలో పాల్గొన్నాం" అని చెప్పారు. కానీ వాటి వివరాలను ఇవ్వడానికి నిరాకరించాడు.

ఎనోచ్ ఉటా  నైరుతి ప్రాంతంలో దాదాపు 7,500 మంది జనాభా ఉన్న గ్రామీణ నగరం. ఇది సాల్ట్ లేక్ సిటీ నుండి మూడున్నర గంటల ప్రయాణం దూరంలో ఉంది. ఈ రాష్ట్రం చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ ప్రధాన కార్యాలయంగా పిలువబడుతుంది, దీని సభ్యులు మోర్మోన్స్ అని పిలుస్తారు. ఇది కుటుంబానికి బలమైన ప్రాధాన్యతనిచ్చే సాంప్రదాయిక క్రైస్తవ శాఖ, కానీ చారిత్రాత్మకంగా బహుభార్యాత్వాన్ని ప్రోత్సహించింది.

click me!