వీడి కక్కుర్తి పాడుగానూ.. ఓకేసారి 35 మంది అమ్మాయిలతో...

By AN TeluguFirst Published Apr 23, 2021, 5:10 PM IST
Highlights

ఇతనో వింత ప్రేమికుడు.. ఇతని ప్రేమకి ఎల్లలు లేవు.. ఇతని హృదయం చాలా విశాలం... ఎంతమంది కైనా చోటుంటుంది.. అందుకే ఒకరు, ఇద్దరు కాకుండా ఏకంగా 35 మందిని లైన్ లో పెట్టాడు. చివరికి విషయం తెలిసి అడ్డంగా బుక్కయ్యాడు. అతడి కక్కుర్తి బుద్దే అతన్ని పట్టించింది.
 

ఇతనో వింత ప్రేమికుడు.. ఇతని ప్రేమకి ఎల్లలు లేవు.. ఇతని హృదయం చాలా విశాలం... ఎంతమంది కైనా చోటుంటుంది.. అందుకే ఒకరు, ఇద్దరు కాకుండా ఏకంగా 35 మందిని లైన్ లో పెట్టాడు. చివరికి విషయం తెలిసి అడ్డంగా బుక్కయ్యాడు. అతడి కక్కుర్తి బుద్దే అతన్ని పట్టించింది.

విషయం ఏంటంటే.. జపాన్ దక్షిణ ప్రాంతానికి చెందిన తకాషి మియాగావా(39) హైడ్రోజన్ వాటర్ షవర్ హెడ్స్, ఇతర పరికరాలు అమ్మే మార్కెటింగ్ కంపెనీ లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. దాంతో పాటు అమ్మాయిల్ని ప్రేమలోకి దించే పనిలో ఫుల్ టైమ్‌ వర్క్ చేస్తున్నాడు.

ఉద్యోగం చేస్తున్న క్రమంలో తనకు పరిచయం అయిన వారిలో ఒంటరి మహిళలను  టార్గెట్ చేసుకునే వాడు. వారితో ప్రేమగా మాట్లాడుతూ ముగ్గులోకి దింపేవాడు. ఆ తర్వాత తాను వారిని ఎంతో సీరియస్గా ప్రేమిస్తున్నానని నమ్మబలికేవాడు.

ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 35 మంది మహిళలను ఏకకాలంలో ప్రేమలో పడేశాడు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే వీరిలో కొందరు... వయసులో ఇతని కంటే పెద్ద వారు కూడా ఉన్నారు.

ఇక మియాగావా ఒరిజినల్ పుట్టినరోజు నవంబర్ 14, కాగా తన ప్రియురాళ్లకి మాత్రం వేరు వేరు నకిలీ తేదీలు చెప్పి వారి నుంచి గిఫ్ట్ పొందేవాడు, ఒకరికి ఫిబ్రవరి.. ఇంకొకరికి ఏప్రిల్.. మరోకరికి జూన్‌.. ఇలా ఫేక్‌ బర్త్‌డే తేదీలు చెప్పి వారి నుంచి లక్షల విలువచేసే దుస్తులు, డబ్బు బహుమతిగా పొందాడు.

 అంతటితో ఆగక తన గర్ల్‌ఫ్రెండ్స్‌లో  కొందరు చేత తాను పనిచేస్తున్న కంపెనీలో ఉత్పత్తులు కూడా కొనేలా చేశాడు. అలా దాని మీద కూడా లాభం పొందాడు. ఎవరైనా ఇక తన ప్రియురాళ్లలో ఎవరైనా పెళ్లి చేసుకోమని అడిగితే తాను సెటిలవ్వాలని త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపేవాడు.

ఇతగాడి మీద అనుమానం వచ్చిన కొందరుప్రియురాళ్లు మియాగావా గురించి ఎంక్వయిరీ చేయగా అతడు బాగోతం బట్టబయలైంది. కేవలం బహుమతులు పొందడం, తన ఉద్యోగంలో టార్గెట్ రీచ్ కావడం కోసమే ఇంత మందితో ప్రేమాయణం నడిపినట్లు అంగీకరించాడు.

బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అంతే కాదు బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఈ ఘటనపై  నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు.. ‘నీ మార్కెటింగ్ తెలివికి జోహార్లు నాయనా’ అంటుండగా.. మరికొందరు నెలకి 30 రోజులు.. రోజుకు ఒక గర్ల్ ఫ్రెండ్ చొప్పున కలిసినా.. మరో ఐదుగురిని ఎలా బ్యాలెన్స్ చేశావు.. ఎలా మ్యానేజ్‌ చేశావ్ స్వామీ.. అంటూ ప్రశ్నిస్తున్నారు.

click me!