ఆ పావురం నాది.. తిరిగి ఇచ్చేయండి.. మోదీకి పాక్ వాసి విన్నపం

Published : Apr 22, 2021, 01:40 PM ISTUpdated : Apr 22, 2021, 01:44 PM IST
ఆ పావురం నాది.. తిరిగి ఇచ్చేయండి.. మోదీకి పాక్ వాసి విన్నపం

సారాంశం

ఆ పావురం తనదేనంటూ.. తనకు తిరిగి ఇచ్చేయాలంటూ ఓ వ్యక్తి భారత ప్రధాని నరేంద్రమోదీని కోరడం గమనార్హం.  

ఇటీవల భారత్ లోకి ఓ పావురం ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆ పావురం పాకిస్తాన్ బోర్డర్ నుంచి ప్రవేశించడంతో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఆ పావురం తనదేనంటూ.. తనకు తిరిగి ఇచ్చేయాలంటూ ఓ వ్యక్తి భారత ప్రధాని నరేంద్రమోదీని కోరడం గమనార్హం.

పాకిస్తాన్ సరిహద్దు నుంచి పంజాబ్‌ బోర్డర్‌కు వచ్చిన తన పావురాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్‌కు చెందిన హబీబుల్లా విజ్ఞప్తి చేశాడు. ఈ నెల 17వ తేదీన పంజాబ్‌ బోర్డర్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ నీరజ్ కుమార్ భుజంపై ఓ పావురం వాలింది. ఆ పావురం కాలికి ఓ తెల్ల కాగితం కట్టి ఉండడంతో దానిని పోస్ట్ కమాండర్ ఒంపాల్ సింగ్‌కు అందించాడు. 

ఆ కాగితంపై ఏవో నెంబర్లు రాసి ఉన్నాయి. దానిని కోడ్ భాషగా భావించిన అధికారులు పావురాన్ని బంధించారు. అయితే ఆ పావురం తనదేనని పాకిస్థాన్‌కు చెందిన గ్రామస్థుడు హబీబుల్లా తాజాగా తెలిపాడు. సరిహద్దుకు 4 కి.మి దూరంలో ఉన్న ఓ గ్రామంలో నివసిస్తున్న హబీబుల్లా ఈద్ పండగా సందర్భంగా ఆ పావురాన్ని ఎగరేశాడట. ఆ పావురం కాలికి కట్టి ఉన్న కాగితంపై రాసి ఉన్నది తన మొబైల్ నెంబర్ అని, అది ఎలాంటి కోడ్ లాంగ్వేజ్ కాదని తెలిపాడు. ఆ పావురాన్ని తనకు తిరిగి ఇప్పించాల్సిందిగా భారత ప్రధానికి విజ్ఞప్తి చేశాడు. 
 

PREV
click me!

Recommended Stories

Train Rules: టికెట్ లేకుండా రైలు ప్ర‌యాణం చేస్తే.. పాకిస్థాన్‌లో ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా.?
IMF: ప్ర‌పంచ దేశాల‌కు ఐఎమ్ఎఫ్ రుణాలు ఇస్తుంది స‌రే.. ఇంత‌కీ IMFకి డ‌బ్బులు ఎక్క‌డివి