విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కుని.. మూడు గంటలు ప్రయాణం... చివరికి...

By AN TeluguFirst Published Nov 29, 2021, 11:04 AM IST
Highlights

అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం ల్యాండింగ్ గేర్ లో సదరు వ్యక్తి దాక్కున్నాడు.  విమానం గాటిమాలా నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళింది. అక్కడ విమానం ల్యాండైన అనంతరం అతన్ని Airport officials పట్టుకుని ఇమిగ్రేషన్ అధికారులు అప్పగించారు. 

విమాన ప్రయాణం అంటే ప్రయాణికులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎయిర్పోర్టు సిబ్బంది కూడా విమానం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అయితే తాజాగా ఓ వ్యక్తి విమానం landing gear లో దాక్కుని ఏకంగా మూడు గంటల పాటు ప్రయాణం చేశాడు. 

విమానం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కాగా, ఆ వ్యక్తిని air port అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం ల్యాండింగ్ గేర్ లో సదరు వ్యక్తి దాక్కున్నాడు.  విమానం గాటిమాలా నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళింది. అక్కడ విమానం ల్యాండైన అనంతరం అతన్ని Airport officials పట్టుకుని ఇమిగ్రేషన్ అధికారులు అప్పగించారు. 

మూడు గంటల పాటు విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కుని ప్రయాణించిన ఈ వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫోటోలు Social mediaలో వైరల్ గా మారాయి. 

ఇదిలా ఉండగా, వాషింగ్టన్ లో ఓ ఫ్లైట్ హైజాగ్ మిస్టరీ 50యేళ్లుగా వీడలేదు. దీనికి ముందు 1971వ సంవత్సరం. సుమారు నాలుగు పదుల వయసు ఉండి ఉండవచ్చు. బిజినెస్ సూట్ ధరించి ఉన్నాడు. క్లాస్‌గా లుక్ ఇస్తూ ఎయిర్‌పోర్టు కౌంటర్‌లో ఫ్లైట్ టికెట్ తీసుకున్నాడు. అంతే హుందాగా ప్లేన్ ఎక్కి కూర్చున్నాడు. ఎయిర్ హోస్టెస్‌కు సింపుల్‌గా ఓ కాగితం ముక్క చేతికి ఇచ్చాడు. ఆమె మరో పనిలో మునిగి ఆ కాగితం ముక్కపై అంతగా శ్రద్ధ వహించలేదు. ఆమెను దగ్గరకు పిలిచి కాస్త ఆమె వైపు వంగి తన సూట్ కేసులో బాంబ్ ఉన్నదని నింపాదిగా చెప్పాడు. Bomb మాట వినగానే ఎయిర్ హోస్టెస్ హడలిపోయింది. 

పురిటినొప్పులతో సైకిల్‌పై హాస్పిటల్ వెళ్లిన ఎంపీ.. ప్రసవం.. ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్

ఆ విమానాన్ని హైజాక్ చేసి అప్పట్లోనే రెండు లక్షల డాలర్లు (ఇప్పుడు వాటి విలువ సుమారు 13 లక్షల డాలర్లు) బ్యాగ్‌లో సర్దుకున్నాడు. అందరు చూస్తుండగానే విమానం వెనుక డోర్ ఓపెన్ చేసి బయట అడుగు పెట్టాడు. అంతే మరెవరకీ ఆయన చిక్కలేదు. ఈ ఘటన జరిగిన 50 ఏళ్లు గడిచినా ఆయన ఆచూకీ లభించలేదు. ఆయన ఫ్లైట్ నుంచి దూకేసిన ప్రాంతంగా భావిస్తున్న చోట్ల విస్తృత తనిఖీలు చేశారు. 

కనీసం ప్యారాచూట్ ఆనవాళ్లూ కనిపించలేవు. ఏ ఆధారాలు దొరకలేవు. ఎఫ్‌బీఐ ఈ కేసుపై దశాబ్దాలుగా దర్యాప్తు చేసి 2016లో కేసు మూసేసింది. సేమ్ జేమ్స్ బాండ్(James Bond) తరహాలో ఆయన ఈ సాహస కృత్యం అదే.. దొంగతనం చేశాడని కొందరిలో కొంత పాజిటివ్ పాయింట్ కూడా వచ్చింది. కొందరైతే ఆయనపట్ల అభిమానాలను బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఆయన పేరు.. ఊహా చిత్రాలతో టీ షర్టులు, కాఫీ కప్‌లు.. ఒకటేమిటో.. ఆయన దొంగే అయినా, ఒక హీరో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. కానీ, ఇప్పటికీ ఆయన ఎవరో అనేది రహస్యంగా ఉండిపోయింది.
 

click me!