అమ్మాయిలు డ్రెస్ మార్చుకుంటుంటే..పై నుంచి చూస్తూ..

Published : Feb 04, 2021, 08:55 AM IST
అమ్మాయిలు డ్రెస్ మార్చుకుంటుంటే..పై నుంచి చూస్తూ..

సారాంశం

అమ్మాయిలు ఏవరైనా బట్టలు మార్చుకుంటే చూద్దామని. కొద్దిసేపటి తర్వాత అతడి బరువు తాళలేకపోయిన సీలింగ్‌ షీటు ఊడిపోయింది. 

అమ్మాయిలు దుస్తులు మార్చుకునే గది వద్ద ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.అమ్మాయిలు డ్రెస్ మార్చుకుంటే చూడకూడదనే కామన్ సెన్స్ కూడా లేకుండా.. అక్కడ కూడా తన కామ వాంఛ తీర్చుకోవాలని అనుకున్నాడు. రహస్యంగా.. వారు దుస్తులు మార్చుకునే గది పై నుంచి కన్నంలో చూడటం మొదలుపెట్టాడు. అయితే.. సడెన్ గా ఆ గది పై సీలింగ్ ఊడి పడటంతో.. వాడి వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన అమెరికాలోని వర్జీనియా లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వర్జీనియాకు చెందిన బ్రియాన్‌ ఆంథోనీ జోయ్‌ శనివారం అక్కడి ఓ జిమ్‌కు వెళ్లాడు. వర్కవుట్లు చేయటం అయిపోయిన తర్వాత ఉమెన్స్‌ లాకర్‌ రూం( అమ్మాయిలు బట్టలు మార్చుకునే, దాచుకునే గది)లోని సీలింగ్‌పై నక్కి కూర్చున్నాడు.. అమ్మాయిలు ఏవరైనా బట్టలు మార్చుకుంటే చూద్దామని. కొద్దిసేపటి తర్వాత అతడి బరువు తాళలేకపోయిన సీలింగ్‌ షీటు ఊడిపోయింది. దీంతో అతడు పది అడుగుల ఎత్తునుంచి అమ్మాయిల గదిలోకి ఊడిపడ్డాడు. అదే సమయంలో గదిలోకి వచ్చిన ఓ అమ్మాయి అతడు పైనుంచి కిందపడటంతో బిత్తరపోయింది.

మొదట అతడ్ని జిమ్‌ సిబ్బంది అనుకుంది. అయితే అతడి ఒంటిపై యూనీఫాం‌కు బదులు మామూలు డ్రెస్‌ ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. అతడు కిందపడిన వెంటనే పైకి లేచి, దొంగచూపులు చూస్తూ రూములోంచి బయటకు వెళ్లిపోయాడు.  బ్రియాన్‌పై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి అతడ్ని అడ్డగించి ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేకపోయాడు. అక్కడినుంచి పారిపోయి జిమ్‌లోని బాత్‌రూమ్‌లో దాక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బ్రియాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే