రైతుల ఉద్యమం: పాప్ సింగర్ రిహానాకు అమిత్ షా కౌంటర్

Siva Kodati |  
Published : Feb 03, 2021, 08:11 PM IST
రైతుల ఉద్యమం: పాప్ సింగర్ రిహానాకు అమిత్ షా కౌంటర్

సారాంశం

రైతుల ఉద్యమంపై పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్‌కు కౌంటరిచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. భారతదేశ ఐకమత్యాన్ని ఇలాంటి ప్రచారాలు దెబ్బతీయలేవని.. దేశ పురోగతిని అడ్డుకోలేవని ఆయన స్పష్టం చేశారు

రైతుల ఉద్యమంపై పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్‌కు కౌంటరిచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. భారతదేశ ఐకమత్యాన్ని ఇలాంటి ప్రచారాలు దెబ్బతీయలేవని.. దేశ పురోగతిని అడ్డుకోలేవని ఆయన స్పష్టం చేశారు.

భారతదేశ భవిష్యత్‌ను నిర్ణయించేది విష ప్రచారాలు కాదు.. అభివృద్ధి అన్నారు అమిత్ షా. మరోవైపు ఢిల్లీలో రైతుల ఉద్యమం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. పాప్ సింగర్ రిహానా ట్వీట్‌తో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదంటూ.. రైతుల ఉద్యమంపై సీఎన్ఎన్ ప్రచురించిన కథనాన్ని ట్వీట్ చేశారు రిహానా. ఆమె ట్వీట్ నిన్నంతా చాలా సేపు ట్రెండ్ అయ్యింది.

అయితే ఆ విషయంలో రిహానాకు పలువురు మద్ధతు తెలిపితే.. మరికొంత మంది మాత్రం పూర్తి స్థాయి అవగాహన తర్వాతే స్పందించాలని హితవు పలికారు. ఇకపోతే రిహానా బాటలోనే స్పందించారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ మేనకోడలు మీనా హ్యారిస్, పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్.

రిహానా ట్వీట్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భగ్గుమన్నారు. ఉద్యమం చేస్తుంది రైతులు కాదని, దేశాన్ని విభజించాలని అనుకుంటున్న ఉగ్రవాదులని ట్వీట్ చేశారు. దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చైనా కాలనీలుగా మార్చాలని అనుకుంటున్నారు.. మీలా మా దేశాన్ని అమ్ముకోవాలని అనుకోవడం లేదని రిహానాపై కంగనా విరుచుకుపడ్డారు.

మరోవైపు అంతర్జాతీయ సెలబ్రెటీల ట్వీట్లతో అప్రమత్తమైన కేంద్ర విదేశాంగ శాఖ.. కావాలనే కొందరు బాధ్యతరహిత ట్వీట్లు చేస్తున్నారని విమర్శించింది. ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా పోలీసులు సంయమనంతో వున్నారని సమర్ధించుకుంది. 
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !