వెరైటీ ఆలోచనతో డబ్బు సంపాదన:బంగ్లాదేశ్ వ్యక్తిపై కేసు నమోదు

By narsimha lode  |  First Published Mar 23, 2024, 7:22 AM IST

జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటేందుకు  నిచ్చెన ఏర్పాటు చేసి ప్రయాణీకుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.


ఢాకా: వినూత్నంగా ఆలోచించడం ద్వారా  డబ్బులు సంపాదించవచ్చని  ఓ వ్యక్తి ఆలోచించారు. ఇందుకు సంబంధించిన  వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  బంగ్లాదేశ్ లోని  ఢాకా-చిట్టగాంగ్ జాతీయ రహదారిని దాటేందుకు  ప్రయాణీకులు  దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది.

 అయితే జాతీయ రహదారిపై ఉన్న బారికేడ్లను దాటేందుకు చిన్న నిచ్చెనను ఏర్పాటు చేసి ప్రయాణీకులను ఓ వ్యక్తి రోడ్డు దాటిస్తున్నాడు. అయితే ఇలా బారికేడ్ల వద్ద నిచ్చెన సహాయంతో  రోడ్డు దాటిన వారి నుండి  కొంత నగదు వసూలు చేస్తున్నాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దరిమిలా పోలీసులు  ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని  స్థానిక మీడియా కథనాలు తెలుపుతున్నాయి. ఈ ఘటన ఈ నెల  17న చోటు చేసుకుంది.

Latest Videos

undefined

బారికేడ్లు దాటిన తర్వాత  ప్రయాణీకులు నగదును ఇచ్చేందుకు  అక్కడే నిలబడ్డారు. జాతీయ రహదారిపై  వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయినా కూడ  రోడ్డుపైనే ఇదంతా జరుగుతుంది.  అయితే ఈ వ్యవహారాన్ని ఓ వ్యక్తి  రికార్డు చేసి  సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  

 

మలేషియా సన్ కథనం మేరకు  ఢాకా-చిట్టగాంగ్ హైవేపై  నారాయణగంజ్ షిమ్రైల్ క్రాస్ రోడ్డు  వద్ద  ఈ ఘటన చోటు చేసుకుంది. బారికేడ్ల  వద్ద నిచ్చెన ఏర్పాటు చేసి ప్రయాణీకులను రోడ్డు దాటించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Some people don't miss the opportunity to make money 😅😂 pic.twitter.com/Jg6hFmvobk

— The Instigator (@Am_Blujay)


 

click me!